Telangana High Court dismissed Koppula Eshwar Election Dispute Case : మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. ధర్మపురి నుంచికొప్పుల ఈశ్వర్2018 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ(Telangana Election 2018)తో గెలుపొందారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన లక్ష్మణ్ రీ కౌంటింగ్ నిర్వహించాలని ఎన్నికల అధికారులను కోరారు. రీ కౌంటింగ్‌లోనూ కొప్పుల ఈశ్వర్ గెలిచినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
దీంతో లక్ష్మణ్ హైకోర్టు(Telangana High Court)ను ఆశ్రయించారు. రీకౌంటింగ్‌లో ఎన్నికల అధికారులు సరైన ప్రమాణాలు పాటించలేదని కొప్పుల ఈశ్వర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని కోరారు. ఆ తర్వాత తనను ఎమ్మెల్యేగా ప్రకటించాలని లక్ష్మణ్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై ఇరువైపుల వాదోపవాదాలు ఇప్పటికే ముగిశాయి. పిటిషన్‌ను కొట్టేస్తూ హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.
High Court on Dharmapuri Election Dispute :2018 సాధారణ ఎన్నికల్లో ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎన్నిక వివాదంపై గతంలో తెలంగాణ హైకోర్టు విచారణ జరిపి.. స్ట్రాంగ్ రూం తెరవాలని సూచించింది. ఈసారి కోర్టు స్ట్రాంగ్ రూం తాళాలు బద్ధలు కొట్టమని జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేసింది. అంతే కాకుండా రిటర్నింగ్ అధికారి కోరితే వాహనం, భద్రత ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. అవసరమైతే వడ్రంగి, లాక్స్మిత్ సహకారం తీసుకోవాలని జగిత్యాల జిల్లా కలెక్టర్‌కు న్యాయస్థానం తెలిపింది. ఆర్వోకు డాక్యుమెంట్లు, సీసీ ఫుటేజ్ వివరాలు ఇవ్వాలని ధర్మాసనం ఆదేశంతో.. తాళం చెపి సరిపోక స్ట్రాంగ్ రూం తెరవలేకపోయినట్లు కలెక్టర్ హైకోర్టుకు తెలిపారు.
హైకోర్టులో మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు చుక్కెదురు.. ఏ కేసులో అంటే..?