ఇళ్లల్లోనే గణేశ్ ఉత్సవాలు జరుపుకోవాలన్న పోలీసుల నిర్ణయంలో అత్యవసరంగా జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. వినాయక మండపాలు ఏర్పాటు కోసం లంచ్ మోషన్ దాఖలు చేసేందుకు అనుమతివ్వాలని న్యాయవాది నర్సింహారావు ఇవాళ హైకోర్టును కోరారు. కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ హిందూ సంప్రదాయాల ప్రకారం ఎప్పటిలాగే ఉత్సవాలు జరుపుకోవడానికి అనుమతివ్వాలని న్యాయవాది అభ్యర్థించారు.
గణేశ్ ఉత్సవాల విషయంలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు - ganesh festival in hyderabad
ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో గణేశ్ ఉత్సవాల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది. పోలీసుల నిర్ణయంలో అత్యవసరంగా జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. అత్యవసర విచారణ కోసం లంచ్ మోషన్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
![గణేశ్ ఉత్సవాల విషయంలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు telangana high court comment on ganesh festival](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8495206-66-8495206-1597933511487.jpg)
telangana high court comment on ganesh festival
కరోనా పరిస్థితుల్లో సామూహిక ఉత్సవాల బదులుగా.. ఇళ్లల్లోనే పూజలు చేయాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ స్పష్టం చేశారని హైకోర్టు పేర్కొంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో తాము జోక్యం చేసుకోలేమని... ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం తెలిపింది. ఈ నేపథ్యంలో అత్యవసర విచారణ కోసం లంచ్ మోషన్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.