తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్ జస్టిస్ ఆర్.ఎస్.చౌహన్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ ఆర్.ఎస్. చౌహాన్‌ను... కొలీజియం సిఫార్సు మేరకు రాష్ట్రపతి పూర్తిస్థాయి ప్రధాన న్యాయమూర్తిగా నియమించారు.
కర్ణాటక హైకోర్టు నుంచి బదిలీ