'ఎమ్మెల్యేలకు ఎర' కేసు.. రెండు వేర్వేరు తీర్పులు - హైకోర్టులో ఎమ్మెల్యేలకు ఎర కేసు విచారణ
13:28 October 29
breaking
‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో తెలంగాణ హైకోర్టు ధర్మాసనాలు రెండు వేర్వేరు తీర్పులిచ్చాయి. ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి భాజపాలో చేరితే కోట్ల రూపాయల నగదు ఇస్తామంటూ ప్రలోభపెట్టడంపై నమోదైన కేసు దర్యాప్తును సిట్ లేదా సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ భాజపా పిటిషన్ వేసింది. ఈ వ్యాజ్యంపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. నవంబర్ 4 వరకు దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. సైబరాబాద్ పోలీసులు వేసిన మరో పిటిషన్‌లో.. ముగ్గురు నిందితులనూ రిమాండ్‌కు అనుమతిస్తూ మరో ధర్మాసనం తీర్పు వెల్లడించింది.
ఇవీ చూడండి: