తెలంగాణ

telangana

ETV Bharat / state

High Court on DOST Admissions : 'ఆ కాలేజీల్లో 'దోస్త్'​తో సంబంధం లేకుండా ప్రవేశాలు పొందొచ్చు' - దోస్త్​ అడ్మిషన్స్​పై హైకోర్టు తీర్పు

High Court Verdict on DOST Admissions : దోస్త్​కు (డిగ్రీ ఆన్​లైన్​ సర్వీస్​ ఇన్​ తెలంగాణ) సంబంధం లేకుండా ప్రవేశాలకు అనుమతివ్వాలంటూ ఈ ఏడాది కూడా సుమారు 50 ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు హైకోర్టును ఆశ్రయించాయి. ఆరేళ్లుగా మధ్యంతర ఉత్తర్వులతోనే ప్రవేశాలు జరుగుతున్నాయని.. తమ అభ్యంతరాలపై ప్రభుత్వం నుంచి కదలిక లేదని యాజమాన్యాలు ఉన్నత న్యాయస్థానానికి తెలిపాయి. ఈ విద్యా సంవత్సరం కూడా ఆ కాలేజీల ప్రవేశాల్లో జోక్యం చేసుకోవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పెండింగ్​లో ఉన్న పిటిషన్ల వివరాలన్నీ తమ ముందు ఉంచాలని ఉన్నత విద్యా మండలికి తెలిపింది.

High Court
High Court

By

Published : May 20, 2023, 8:00 PM IST

High Court Verdict on DOST Admissions : రాష్ట్రంలోని సుమారు 50 కాలేజీల్లో దోస్త్​తో (డిగ్రీ ఆన్​లైన్​ సర్వీస్​ ఇన్​ తెలంగాణ) సంబంధం లేకుండా డిగ్రీ ప్రవేశాలు నిర్వహించేందుకు హైకోర్టు అనుమతినిచ్చింది. పిటిషన్లు వేసిన కళాశాల ప్రవేశాల్లో జోక్యం చేసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ డిగ్రీ కోర్సులను 2016-17 నుంచి ప్రభుత్వం ఆన్‌లైన్ ప్రవేశాలు చేస్తోంది.

అయితే అదే ఏడాది పలు ప్రముఖ కళాశాలలు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించాయి. తమ అభిప్రాయాలు తెలుసుకోకుండా తమ కాలేజీల్లో ప్రవేశాలు, ఫీజులను నియంత్రించడం తగదని.. ప్రభుత్వం, యూనివర్సిటీలు చట్ట పరిధి దాటి వ్యవహరిస్తున్నాయని యాజమాన్యాలు వాధించాయి. వాదనలు విన్న హైకోర్టు గతంలో మాదిరిగానే నేరుగా కాలేజీలు ప్రవేశాలు జరుపుకోవచ్చునని 2017లో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆ పిటిషన్‌ ఇప్పటికీ హైకోర్టులో పెండింగ్​లోనే ఉంది. ఆ తర్వాత ప్రతి ఏడాదీ ఉన్నత విద్యా మండలి దోస్త్ నోటిఫికేషన్ ఇస్తూనే ఉంది.

సుమారు యాభైకి పైగా కాలేజీలు ప్రతి ఏటా హైకోర్టును ఆశ్రయిస్తూ మధ్యంతర ఉత్తర్వులతో ప్రవేశాలు జరుపుతున్నాయి. ఈ విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం ఇటీవలే దోస్త్ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈ ఏడాదీ సుమారు 50 ప్రైవేట్ కాలేజీలు మళ్లీ హైకోర్టును ఆశ్రయించాయి. తమ అభ్యంతరాలు అలాగే ఉన్నాయని.. ప్రభుత్వం నుంచి స్పందన లేదని కాలేజీల యాజమాన్యాలు హైకోర్టుకు తెలిపాయి. ప్రతి ఏడాదీ పిటిషన్లు వేసి మధ్యంతర ఉత్తర్వులతో ప్రవేశాలు చేస్తున్నామని.. కేసులు పెండింగ్​లోనే ఉన్నాయని యాజమాన్యాల తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.

High Court orders to TS government on Dost admissions : వాదనలు విన్న హైకోర్టు.. పిటిషన్లు వేసిన కాలేజీల్లో గతంలో మాదిరిగానే ఈ విద్యా సంవత్సరం కూడా ప్రవేశాలు చేసుకోవచ్చునని.. ప్రభుత్వం, ఉన్నత విద్యా మండలి జోక్యం చేసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అంశంపై పెండింగ్​లో ఉన్న పిటిషన్లు అన్నీ తమ ముందుంచాలని ఉన్నత విద్యా మండలిని హైకోర్టు ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, ఉన్నత విద్యా మండలిని, ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలను ఆదేశిస్తూ విచారణను జూన్ 15కు వాయిదా వేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details