హైదరాబాద్‌కు చెందిన ఆర్‌ఆర్ ట్రేడర్స్ తయారు చేసిన కరోనా రక్షణాత్మక దుస్తులతో పాటు ఆ సంస్థ వైబ్‌సైట్‌ను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆవిష్కరించారు. మేడిన్ ఇన్ ఇండియా, మేకింగ్ ఇన్ తెలంగాణలో భాగంగా .... నాణ్యతతో కూడిన పీపీఈ కిట్స్, ఎన్-95 మాస్కులు, గ్లౌజ్‌లను తయారు చేయడం అభినందనీయమని కొనియాడారు.
అత్యవసర సేవకులకు ఇబ్బంది రానివ్వం: ఈటల - Madin in India, Making in Telangana
మేడిన్ ఇన్ ఇండియా, మేకింగ్ ఇన్ తెలంగాణలో భాగంగా ఆర్‌ఆర్ ట్రేడర్స్ తయారు చేసిన పీపీఈ కిట్స్, ఎన్-95 మాస్కులను మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. అత్యవసర సేవలందిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం రక్షణాత్మక దుస్తులు అందిస్తుందని వెల్లడించారు.
అత్యవసర సేవకులకు ఇబ్బంది రానివ్వం
ఈ సందర్భంగా ఆర్‌ఆర్ ట్రేడర్స్ ఎండీ కలహార్‌రెడ్డిని మంత్రి అభినందించారు. అత్యవసర సేవలందిస్తున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం రక్షణాత్మక దుస్తులు అందిస్తుందని వెల్లడించారు. ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.