తెలంగాణ

telangana

ETV Bharat / state

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విచారణ రెండు వారాలకు వాయిదా - పూర్తి వివరాలు ఇవ్వాలన్న హైకోర్టు - Telangana HC on Medigadda Barrage Damage

Telangana HC on Medigadda Barrage Damage : మేడిగడ్డ బ్యారేజీ కుంగిబాటుపై హైకోర్టు విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ ఘటనపై సీఎస్ శాంతి కుమారి నుంచి వివరాలు సేకరించి ఇవ్వాలని ప్రభుత్వ న్యాయవాదిని ఆదేశించింది. మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై కాంగ్రెస్ నేత నిరంజన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

High Court on Medigadda Incident
High Court adjournment of Medigadda Incident

By ETV Bharat Telangana Team

Published : Dec 19, 2023, 11:35 AM IST

Updated : Dec 19, 2023, 6:21 PM IST

Telangana HC on Medigadda Barrage Damage :మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిన ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను రెండు వారాల్లోపు సమర్పించాలని అదనపు అడ్వకేట్ జనరల్ రజినీకాంత్‌ను హైకోర్టు ఆదేశించింది. బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నమోదైన కేసును సీబీఐతో పాటు తీవ్ర నేరాల దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించేలా ఆదేశాలివ్వాలని టీపీసీసీ నేత నిరంజన్ దాఖలు చేసిన పిటీషన్‌ను సీజే జస్టిస్ ఆలోక్‌ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్‌ జూకంటిలతో కూడిన ధర్మాసనం విచారించింది.

పిల్లర్లు కుంగిన విషయాన్ని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, రాష్ట్రపతి, గవర్నర్, కేంద్రానికి సైతం నిరంజన్ లేఖలు రాశారు. కేంద్ర ఎన్నికల కమిషన్ నవంబర్ 7వ తేదీన ఈ పిటీషన్‌ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించింది. మేడిగడ్డ పిల్లర్లు కుంగిన అంశం నేషనల్ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ(National Dam Safety Authority on Meddigadda Issue) సంబంధించిన విషయం అయితే పిటీషనర్ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషన్, రాష్ట్రపతి, గవర్నర్ కు ఎందుకు ఫిర్యాదు చేయాల్సి వచ్చిందని హైకోర్టు పిటీషనర్ తరఫు న్యాయవాదిని ప్రశ్నించింది.

High Court on Medigadda Incident: ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో పిటీషన్ దాఖలు చేసినందున ఈసీతో దృష్టికి తీసుకెళ్లాల్సి వచ్చిందని పిటీషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. సీఈసీ పంపిన లేఖపై ప్రభత్వ ప్రధాన కార్యదర్శి ఏమైనా చర్యలు తీసుకుందా అనే సమాచారం తీసుకొని రెండు వారాల్లోపు అందించాలని ఏఏజీ రజినీకాంత్‌ను హైకోర్టు ఆదేశించింది. విచారణను హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కారకులను వదిలిపెట్టేదేలే : మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి

Congress Leader Niranjan Petition on Medigadda Barrage: ఈ సంవత్సరం అక్టోబర్ 21న మేడిగడ్డ పిల్లర్​ కుంగిపోయింది. అప్పటినుంచి రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. రాజకీయ నాయకులు ప్రాజెక్టు సందర్శన కూడా చేశారు. అనంతరం డిసెంబర్​ 9న ఈ ప్రాజెక్ట్​ పిల్లర్లు ఎందుకు కుంగిపోయాయో తేల్చడానికి సీబీఐతో దర్యాప్తు చేయాలని కాంగ్రెస్​ నాయకుడు నిరంజన్(Congress Leader Petition on Medigadda Issue) రాష్ట్ర హైకోర్టులో పిటిషన్​ వేశారు. దీంతో హైకోర్టు రిజిస్ట్రీ ఈ దావాను పరిశీలనకు తీసుకుంది. మేడిగడ్డ ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపాలున్నాయని జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ గత నెల నివేదికలో స్పష్టం చేసిందని, దాని ఆధారంగా కేసు నమోదు చేయాలని కోరారు.

కుంగిన మేడిగడ్డ ప్రాజెక్టు పూర్తి వివరాలు అందించాలి : సీఎం రేవంత్ రెడ్డి

Medigadda Barrage Issue in Telangana :మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుకు కారణమైన వారిపై క్రిమినల్ చర్యల తీసుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలను జారీ చేయాలని నిరంజన్​ విజ్ఞప్తి చేశారు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ లిమిటెడ్(Kaleswaram Irrigation Project Corporation Limited) పేరుతో రూ. 86 వేల కోట్లు సేకరించి ఎలా ఖర్చుపెట్టారో కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని కోరారు. పిల్లర్లు కుంగడంపై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఫిర్యాదుతో జయశంకర్ జిల్లా మహదేవపూర్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదయిందని పేర్కొన్నారు. ఈ కేసును ఇప్పుడు సీబీఐకి బదిలీ చేయాలని పిటిషన్​లో హైకోర్టుకు నిరంజన్ విన్నవించారు.

'మేడిగడ్డ' ఘటనలో ఊహించని ట్విస్ట్ - పునరుద్ధరణ బాధ్యత ప్రభుత్వానిదే అంటూ నిర్మాణ సంస్థ లేఖ

వర్షాకాలంలోగా మేడిగడ్డ పునరుద్ధరణ కష్టమే - ఆందోళనలో నీటిపారుదల శాఖ

Last Updated : Dec 19, 2023, 6:21 PM IST

ABOUT THE AUTHOR

...view details