తెలంగాణ

telangana

ETV Bharat / state

High Court serious on CS: సీఎస్​పై హైకోర్టు సీరియస్.. రూ.10వేల జరిమానా

High Court serious on CS: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​ కుమార్​పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నాలుగేళ్లుగా ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని ప్రశ్నించింది. నీటి పారుదల ప్రాజెక్టుల కోసం 2016లో జారీ చేసిన 123 జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ధర్మాసనం నాలుగేళ్లుగా విచారణ చేపడుతోంది.

High court Serious on CS Somesh kumar
సీఎస్​పై హైకోర్టు సీరియస్

By

Published : Dec 22, 2021, 10:06 PM IST

High Court serious on CS: నాలుగేళ్లుగా కౌంటర్ దాఖలు చేయనందుకు సీఎస్​ సోమేశ్​ కుమార్​పై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. పదివేల రూపాయలు జరిమానా చెల్లించడంతో పాటు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. నీటి పారుదల ప్రాజెక్టుల కోసం 2016లో జారీ అయిన 123 జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై ధర్మాసనం నాలుగేళ్లుగా విచారణ చేపడుతోంది.

high court on cs somesh kumar: నీటి పారుదల ప్రాజెక్టులపై దాఖలైన పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేయాలని నాలుగేళ్లుగా ప్రతి విచారణలో హైకోర్టు ఆదేశిస్తోంది. కౌంటరు దాఖలు చేయాలని లేదా వ్యక్తిగతంగా హాజరు కావాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న సీఎస్ సోమేశ్​ కుమార్​ను గత నెలలో కూడా న్యాయస్థానం ఆదేశించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్​ చంద్ర శర్మ, జస్టిస్ తుకారాంజీ ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. ఇప్పటి వరకు కౌంటర్లు దాఖలు చేయలేదని.. హాజరు మినహాయింపు కోరుతూ కనీసం పిటిషన్ కూడా వేయలేదని సోమేశ్​ కుమార్​పై అసహనం వ్యక్తం చేసింది. ప్రధాన మంత్రి కొవిడ్ సహాయ నిధికి 10 వేల రూపాయలు చెల్లించాలని ఆదేశిస్తూ.. జనవరి 24న విచారణకు హాజరు కావాలని పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details