High Court Green signal to Singareni Elections : సింగరేణి ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. ఎన్నికల నిర్వహణకు హైకోర్టు పచ్చ జెండా ఊపింది. ఈనెల 27వ తేదీన యథావిథిగా సింగరేణి ఎన్నికలు నిర్వహించాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎలక్షన్ వాయిదా వేయాలన్న ప్రభుత్వ అభ్యర్థన హైకోర్టు తోసిపుచ్చింది. మరోవైపు ఎన్నికలు వాయిదా వేయాలని సింగరేణి (Singareni Elections) యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ను కూడా హైకోర్టు తోసిపుచ్చింది.
Singareni Elections Postponed : ఈ నెల 28న జరగాల్సిన సింగరేణి ఎన్నికలు వాయిదా..
సింగరేణి ఎన్నికలను నిర్దేశించిన తేదీనే నిర్వహించాలని సింగరేణి యాజమాన్యాన్ని, ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. వచ్చే మార్చి వరకు వాయిదా వేయాలంటూ దాఖలైన మధ్యంతర పిటీషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. ఇది వరకు నిర్ణయించినట్లు ఈ నెల 27వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని, అదే రోజు ఫలితాలను కూడా వెల్లడించాలని ఉత్తర్వులు జారీ చేసింది.
Singareni Petition in High Court on Elections : కొత్త ప్రభుత్వం ఏర్పడి కొన్ని రోజులే అయిందని, ఉన్నతాధికారుల బదిలీలకు ప్రాధాన్యం ఇస్తున్నందున సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలకు గడువు కావాలని ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్ తేరా రజినీకాంత్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. 27వ తేదీన నిర్వహిస్తామని ఇది వరకు చెప్పారు కదా అని హైకోర్టు ఏఏజీని ప్రశ్నించింది. ప్రభుత్వ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది.