Telangana Gurukul Results 2023 :రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో 9210 పోస్టుల భర్తీకి నిర్వహించిన కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఫలితాలు ఈ నెలాఖరులోగా వెల్లడి కానున్నాయి. ఈ పోస్టులకు రాష్ట్రవ్యాప్తంగా 2.66 లక్షల మంది దరఖాస్తు చేయగా.. 17 జిల్లాల్లోని 104 కేంద్రాల్లో రోజుకు మూడు షిప్టుల చొప్పున రాత పరీక్షలను గురుకుల నియామక బోర్డు(TREIRB) నిర్వహించింది. వాటికి సగటున 75.68 శాతం మంది హాజరైనట్లు.. బోర్డు కార్యనిర్వహణాధికారి మల్లయ్య భట్టు తెలిపారు. పరీక్షల మాస్టర్ ప్రశ్న పత్రాలు, అభ్యర్థుల సమాధానాలు, ప్రాథమిక కీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు.
TS Gurukulam Exam 2023 : మూడు పేపర్లు.. మూడు జిల్లాల్లో..
TREIRB Results 2023 : అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్ ద్వారా సమాధానాలు సరి చూసుకోవాలని.. ప్రాథమిక కీ పై అభ్యంతరాలుంటే గడువు తేదీలోగా తెలపాలని సూచించారు. అభ్యంతరాలు లాగిన్ ఐడీ ద్వారా మాత్రమే తెలపాలని, ఈ-మెయిల్, వ్యక్తిగత, రాతపూర్వక అభ్యంతరాలు స్వీకరించబోమని స్పష్టం చేశారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో జరిగిన పరీక్షలకు సంబంధించి అభ్యర్థుల సమాధానాలు, ప్రాథమిక కీ ఈరోజు మధ్యాహ్నానికి అందుబాటులోకి వస్తుందని బోర్డు వర్గాలు తెలిపాయి.
Telangana Gurukulam Results 2023.. : రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి 19 వరకు జరిగిన పరీక్షలకు సంబంధించిన మాస్టర్ ప్రశ్నాపత్రాలు, ప్రాథమిక కీ, అభ్యర్థుల సమాధానాలను గురుకుల నియామక బోర్డు వెబ్‌సైట్‌లోని వ్యక్తిగత లాగిన్‌లో బుధవారం పొందుపరిచింది. ఈ ప్రాథమిక కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే.. రేపు (ఈ నెల 25వ తేదీ) సాయంత్రంలోగా తెలపాలని సూచించింది.