TSPSC To Conduct Group-1 Prelims Exam :ఎన్నో ఒడుదొడుకుల మధ్య చివరికి టీఎస్‌పీఎస్సీ నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు పూర్తిస్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించిగా.. ఆ అనిశ్చితికి కోర్టు నిర్ణయంతో తెరపడింది. ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జూన్11న పరీక్షను టీఎస్‌పీఎస్సీ నిర్వహించనుంది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రవేశపత్రాలను వారం రోజుల ముందుగానే.. వెబ్‌సైట్‌లో ఉంచనున్నారు. గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్‌ను ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహంచనున్నట్లు కమిషన్ పేర్కొంది.
TSPSC Group-1 Prelims : గతేడాది ఏప్రిల్‌లో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తొలిగ్రూప్-1 పరీక్షను నిర్వహించడానికి... అత్యధికంగా 503 ఉద్యోగాలతో టీఎస్‌పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన వెలువడడంతో గ్రూప్-1 రాసే అభ్యర్థులు ఉత్సాహంతో... ప్రిపరేషన్ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 3.8 లక్షల మంది ఉద్యోగార్థులు గ్రూప్-1కు దరఖాస్తు చేసుకున్నారు. ఆ ఉత్సాహంతోనే అక్టోబరు 16వ తేదీన జరిగిన ప్రిలిమినరీ పరీక్షకు 2.85 లక్షల మంది హాజరయ్యారు. ఆ తర్వాత మార్చిలో టీఎస్‌పీఎస్సీలో పేపర్ లీకేజీ వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో అప్పుడు జరిగిన పరీక్షను రద్దు చేసి... జూన్ 11న తిరిగి నిర్వహిస్తామని కమిషన్ స్పష్టం చేసింది. ప్రిలిమినరీలో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ విషయంలో కొంత నిరుత్సాహ పడ్డారు.
TS HC on Group1 Prelims Exam : గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ
Telangana Group-1 Arrangements : ఈ విషయంపై కొందరు అభ్యర్థులు పరీక్షను వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసును విచారించిన న్యాయస్థానం గ్రూప్-1 వాయిదాకు నిరాకరించింది. దీంతో యథావిధిగా నిర్వహించేందుకు కమిషన్ కసరత్తు చేసి.. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసింది. త్వరలోనే గ్రూప్-1 ప్రిలిమినరీ ప్రవేశపత్రాలను వెబ్‌సైట్లో పొందుపరిచే.. సీబీఆర్‌టీ విధానాన్ని పరిశీలిస్తున్నారు.
సీబీఆర్‌టీ పరీక్ష నిర్వహణకు వీలు కాదు : గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను మళ్లీ నిర్వహించడానికి టీఎస్‌పీఎస్సీ కమిషన్ లోతుగానే చర్చలు జరిపారు. ప్రశ్నపత్రాలు లీకేజీ కావడంతో కమిషన్ నిర్వహించే పరీక్షలను మల్టీసెషన్ల విధానంలో నిర్వహించి.. నార్మలైజేషన్ కిదం మార్కులు లెక్కించాలని టీఎస్‌పీఎస్సీ భావించింది. ఈ నేపథ్యంలో గ్రూప్-1 పరీక్షపై చర్చలు జరిగాయి. రాష్ట్రంలో 40వేల మంది మాత్రమే సీబీఆర్‌టీ పరీక్షలు రాసేందుకు సామర్థ్యం ఉంది. ఈ లెక్కన చూసుకుంటే 3.8 లక్షల మందికి పరీక్షను నిర్వహించాలంటే దాదాపు పది రోజులు సమయం పట్టే అవకాశం ఉంది.
దీంతో గత్యంతరం లేక ప్రిలిమినరీ పరీక్షను ఓఎంఆర్ విధానంలో నిర్వహించాలని కమిషన్ నిర్ణయించి.. అందుకు తగిన ఏర్పాట్లును చేస్తోంది. టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఒక పోస్ట్‌ను క్రియేట్ చేశారు. కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్టును సృష్టించారు. అప్పటి నుంచి గ్రూప్-1 రాత పరీక్ష ప్రక్రియ బాధ్యత మొత్తాన్ని ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో పరీక్షల నిర్వహణ కోసం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ పోస్టును సృష్టించి, ఐఏఎస్ అధికారికి బాధ్యతలను టీఎస్‌పీఎస్సీ అప్పగించింది.
ఇవీ చదవండి :