తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Govt Vs Governor 2023 : రాజ్‌భవన్‌-ప్రగతిభవన్‌ మధ్య ఎంతెంత దూరం..? ఎన్నిసార్లు దూరం..?

Telangana Govt Vs Governor 2023 : రాజ్‌భవన్‌, ప్రగతిభవన్‌ మధ్య అంతరం మరోసారి బయటపడింది. ఇప్పటికే రాజ్‌భవన్‌లో పలు బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. నామినేటెడ్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామక ప్రతిపాదనను తిరస్కరించడం మళ్లీ విభేదాలకు దారి తీసింది. గవర్నర్‌ నిర్ణయంతో తదుపరి కార్యాచరణపై ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చించారు. రాజ్‌భవన్‌ నిర్ణయంపై మంత్రులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించగా.. తమిళిసై నిర్ణయం సరైనదంటూ కిషన్‌రెడ్డి స్వాగతించారు.

Rajbhavan-Pragathibhavan Controversy Telangana
Nominated MLCs Names Rejection Controversy Telangana

By ETV Bharat Telangana Team

Published : Sep 26, 2023, 6:59 AM IST

Updated : Sep 26, 2023, 7:10 AM IST

Telangana Govt Vs Governor 2023 రాజ్‌భవన్‌ ప్రగతిభవన్‌ మధ్య ఎంతెంత దూరం ఎన్నిసార్లు దూరం

Telangana Govt Vs Governor 2023 : నామినేటెడ్‌ ఎమ్మెల్సీల పదవుల కోసం రాష్ట్ర మంత్రివర్గం సిఫార్సు చేసిన ఇద్దరి పేర్లను గవర్నర్‌ తమిళిసై తిరస్కరించడం చర్చనీయాంశంగా మారింది. మాజీ ఎమ్మెల్యే కుర్రా సత్యనారాయణ, బీఆర్‌ఎస్‌ నేత దాసోజు శ్రవణ్‌ల పేర్లను ఆమోదానికి పంపగా.. గవర్నర్‌ నామినేటెడ్‌ కోటా కింద వారిద్దరికీ తగిన అర్హతలు లేవని ఈ నెల 19న దస్త్రాలను తిప్పి పంపించారు. ఇందుకు కారణాలను విశ్లేషిస్తూ.. సీఎం కేసీఆర్, సీఎస్ శాంతికుమారికి లేఖలు రాశారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వారి పేర్లను సిఫారసు చేయడం సరికాదని, ఇకపై రాజకీయాలతో సంబంధం లేని అర్హులనే సిఫార్సు చేయాలని సూచించారు.

Telangana Rajbhavan Vs Pragathi Bhavan : రాజ్‌భవన్‌ నుంచి సమాచారం అందిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తన నివాసంలో పార్టీ నేతలతో నామినేటెడ్‌ ఎమ్మెల్సీల ఎంపిక అంశంపై చర్చించారు. గతంలో కౌశిక్‌రెడ్డి పేరును తిరస్కరించిన తర్వాత రెండోసారి ఆయన అభ్యర్థిత్వాన్ని గవర్నర్‌కు పంపలేదు. ఆయనకు ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. అయితే తాజాగా ఇద్దరు బీసీ, ఎస్టీ సామాజిక వర్గాల వారు కావడంతో వారిని మార్చకూడదనే అభిప్రాయం వ్యక్తమైనట్లు సమాచారం. ఎన్నికల కోడ్‌ కన్నా ముందుగానే మరోసారి మంత్రిమండలి సమావేశంనిర్వహించి రెండోసారి వీరి పేర్లను పంపాలని భావించినట్లు తెలుస్తోంది. గవర్నర్‌ నిర్దేశించిన నిబంధనల పరిధికి సంబంధించిన సమాచారం ఇవ్వాలనే అంశంపైనా చర్చ జరిగినట్లు సమాచారం.

BRS Leaders Fires on Governor Tamilisai : 'తమిళిసైకి గవర్నర్‌గా కొనసాగే అర్హత లేదు.. వెంటనే రాజీనామా చేయాలి'

Telangana Governor Rejected Nominated Quota MLCs Names : నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవులకు పంపిన పేర్లను తిరస్కరించడంపై గవర్నర్‌పై మంత్రులు విమర్శలు గుప్పించారు. దశాబ్దాలుగా ప్రజా సేవలో ఉన్న అత్యంత వెనకబడిన వర్గాలకు చెందిన వారిద్దరూ.. బీఆర్‌ఎస్ సభ్యులుగా ఉన్నందునే అనర్హులనడం దారుణమని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా చేసిన తమిళిసై.. తెలంగాణ గవర్నర్‌గా ఎలా ఉంటారని ధ్వజమెత్తారు. సర్కారియా కమిషన్‌ ప్రతిపాదనల ప్రకారం గవర్నర్‌ పదవిలో తమిళిసై ఉండకూడదు కదా అని పేర్కొన్నారు. గవర్నర్‌ నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలి పెట్టు అన్న మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి.. ఇది రాజ్యంగ వ్యతిరేకమన్నారు. రాజకీయాల నుంచి నేరుగా గవర్నర్‌ అయిన తమిళిసైకి ఆ పదవిలో కొనసాగే నైతిక అర్హత లేదని మంత్రి ప్రశాంత్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుట్ర వల్లే ఎమ్మెల్సీ నియామక దస్త్రాలను తెలంగాణ గవర్నర్ తిరస్కరించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అనుమానం వ్యక్తం చేశారు.

BRS Leaders Fires on Governor Tamilisai : తెలంగాణ విషయంలో గవర్నర్‌ తమిళిసై వైఖరిలో మార్పు లేదు: మంత్రి హరీశ్‌రావు

CM KCR Vs Tamilisai :మరోవైపు.. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై తమిళిసై నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కవులు, కళాకారులు, సేవ చేసే వారికి గవర్నర్, రాష్ట్రపతి కోటాలో అవకాశం కల్పిస్తారని.. కానీ కేసీఆర్ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తులను నియమించాలని ప్రయత్నిస్తున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు. ఇదిలా ఉండగా.. నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పదవికి తాను అర్హుడినేనని దాసోజు శ్రవణ్‌ తెలిపారు. సామాజిక సేవ, రాజకీయాలు పరస్పర విరుద్ధమైనవేమి కావన్నారు.

KCR vs Governor Tamilisai: 'తెలంగాణలో ప్రోటోకాల్ పాటించటం లేదు'

Governor Tamilisai Rejected Nominated Quota MLCs Names : నామినేటెడ్‌ కోటా ఎమ్మెల్సీల పేర్లు తిరస్కరించిన గవర్నర్‌

Last Updated : Sep 26, 2023, 7:10 AM IST

ABOUT THE AUTHOR

...view details