తెలంగాణ

telangana

ETV Bharat / state

HMDA Notification For Land Auction 2023 : కోకాపేటలో ప్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్ విడుదల

Kokapet HMDA Land Sales Notificattin : భూముల అమ్మకం ద్వారా మరోమారు భారీ ఆదాయంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కోకాపేట ప్రాంతంలో అత్యంత ఎక్కువ విలువ కలిగిన భారీ విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లను విక్రయించేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. 43 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఏడు ప్లాట్ల అమ్మకం ద్వారా రూ.2500 కోట్లకు పైగా ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు.

HMDA Notification For Land Auction 2023
HMDA Notification For Land Auction 2023

By

Published : Jul 7, 2023, 1:19 PM IST

కోకాపేటలో ప్లాట్ల విక్రయానికి నోటిఫికేషన్ విడుదల

Telangana Govt on Kokapet HMDA Land Sales : పన్నేతర ఆదాయం ద్వారా నిధులను సమకూర్చుకునే కసరత్తు కొనసాగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మరోమారు అధిక విలువ కలిగిన భూములను విక్రయించనుంది. కోకాపేట ప్రాంతంలోని భూముల అమ్మకం ద్వారా భారీగా ఆదాయాన్ని పొందిన సర్కార్.. మరో 45 ఎకరాలను విక్రయించినుంది. ఈ మేరకు హెచ్​ఎండీఏ నోటిఫికేషన్ జారీ చేసింది.

Land Sales in Kokapet Hyderabad :మూడెకరాలు మొదలు తొమ్మిది ఎకరాల వరకు విస్తీర్ణం ఉన్న ఏడు పెద్ద ప్లాటన్లు అమ్మనున్నారు. ఈ ప్లాట్ల మొత్తం విస్తీర్ణం 45.33 ఎకరాలు కాగా.. ఎకరానికి కనీస ధరను 35 కోట్లుగా పేర్కొన్నారు. వేలంలో ఆ పైన కనీసం రూ.25 లక్షల చొప్పున పెంచుకుంటూ పోవాల్సి ఉంటుంది. ఈ ప్రాంతంలోని భూములు గతంలో భారీగా ధర పలికినందున.. మరోమారు అదే తరహాలో అంచనా వేస్తున్నారు. కనీస ధరకు పోయినా దాదాపు రూ.1,600 కోట్లు సమకూరుతాయి. డిమాండ్ ఉన్న ప్రాంతం, పెద్ద ప్లాట్లు కావడంతో వేలంలో ఎక్కువ ధర పలుకుతుందని భావిస్తున్నారు. ఈ ప్లాట్ల విక్రయంతో రూ.2 వేల 500 కోట్ల వరకు ఆదాయం సమకూరవచ్చని అంచనా వేస్తున్నారు.

HMDA Notification For Land Auction 2023 : ఈ నెల 20వ తేదీన ప్రీబిడ్ సమావేశం నిర్వహించనుండగా.. రిజిస్ట్రేషన్​కు నెలాఖరు వరకు అవకాశం ఉంది. ఆగస్టు మూడో తేదీన 'ఈ- వేలం' ద్వారా భూములను విక్రయిస్తారు. గతంలోనే హైదరాబాద్ శివారుతో పాటు జిల్లాల్లో ఉన్న ప్లాట్లను కూడా ప్రభుత్వం విక్రయించింది. కొన్ని చోట్ల మంచి స్పందన రాగా.. మరికొన్ని చోట్ల మిశ్రమ స్పందన వచ్చింది.

Telangana Govt Plans Land Auctions at Kokapet HMDA Lands : ఇప్పటి వరకు భూములు అమ్మకం, కొనుగోలుదారులు విడతల వారీగా చేసిన చెల్లింపుల ద్వారా రూ.600 కోట్ల వరకు సమకూరినట్లు సమాచారం. మోకిల, షాబాద్​లో వంద ప్లాట్ల విక్రయానికి కూడా ఇటీవల నోటిఫికేషన్ జారీ చేశారు. మోకిలలో 325 నుంచి 433 గజాల విస్తీర్ణం వరకు 50 ప్లాట్లు ఉండగా.. షాబాద్​లో 300 గజాల విస్తీర్ణంతో 500 ప్లాట్లు ఉన్నాయి. మోకిల ప్రాంతంలో డిమాండ్ ఉన్న దృష్ట్యా అక్కడ కూడా మంచి ధర వస్తుందని, ఆదాయం బాగానే సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. వివిధ కార్యక్రమాల కోసం అవసరమైన నిధుల నిమిత్తం భూముల అమ్మకం ప్రక్రియను సర్కార్ వేగవంతం చేసింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details