తెలంగాణ

telangana

ETV Bharat / state

Raithu bandhu: రుణాలతో రైతుబంధు చెల్లింపులు.. ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం..! - వానాకాలం పంటకు రైతుబంధు

Raithu bandhu:యాసంగి రైతుబంధు చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసుకునేందుకు వీలుగా అవసరమైన మొత్తాన్ని సమీకరిస్తోంది. వానాకాలం పంటకు 7 వేల 377 కోట్ల రూపాయలను రైతుబంధు సాయంగా అందించింది.

Raithu bandhu
రుణాలతో రైతుబంధు చెల్లింపులు

By

Published : Dec 18, 2021, 4:31 AM IST

Raithu bandhu:యాసంగికి సంబంధించిన రైతుబంధు చెల్లింపుల కోసం రాష్ట్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. రైతుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేసుకునేందుకు వీలుగా అవసరమైన మొత్తాన్ని సమీకరిస్తోంది. వానాకాలం పంటకు 7 వేల 377 కోట్ల రూపాయలను రైతుబంధు సాయంగా అందించారు. యాసంగి సీజన్‌కు కూడా దాదాపుగా అంతే మొత్తం అవసరం పడనుంది. అందుకు అవసరమైన నగదును సమకూర్చుకునే పనిలో ప్రభుత్వం పడింది.

రుణం తీసుకుని చెల్లించే యోచన

Raithu bandhu scheme in TS: పన్నులు, ఇతర మార్గాల ద్వారా వచ్చే ఆదాయంతో పాటు కొంత మొత్తాన్ని రుణంగా తీసుకొని రైతుబంధు సాయాన్ని అందించనున్నారు. ఈ నెల మొదట్లోనే 1500 కోట్ల రూపాయలు రుణంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో రూ.2 వేల కోట్లు అప్పుగా తీసుకునేందుకు సిద్దమైంది. ఈ మేరకు ఆర్థికశాఖ 11 ఏళ్ల కాలపరిమితికి బాండ్లను జారీ చేసింది. రిజర్వ్ బ్యాంకు ద్వారా వీటిని వేలం వేసి రుణం తీసుకోనున్నారు. అవసరమైతే తరువాత కూడా మరికొంత మొత్తాన్ని అప్పుల ద్వారా సమకూర్చుకోనున్నారు. నిరుడు డిసెంబర్ 27న రైతుల బ్యాంకు ఖాతాల్లో రైతుబంధు సాయాన్ని జమచేశారు. తక్కువ భూవిస్తీర్ణం ఉన్న వారితో ప్రారంభించారు. అదే తరహాలో ఈసారి కూడా ఈ నెల 27 నుంచి రైతుబంధు సాయం అందించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details