Telangana Govt Issued Orders Grain Auction : రాష్ట్రంలో ధాన్యం వేలం వేసేందుకు సర్కారు సిద్ధమైంది. 2022-23 వానా కాలం, యాసంగి సీజన్లు సంబంధించి రైస్‌మిల్లుల్లో భారీగా పేరుపోయిన మిగులు ధాన్యం నిల్వలు వేలం వేయాలని నిర్ణయించింది. అకాల వర్షాలకు ధాన్యం(Grain) తడిసి నాణ్యత కొరవడి నూక శాతం అధికంగా వస్తుందన్న కారణంగా ఎఫ్‌సీఐ(FCI) ఆ ధాన్యం తీసుకునేందుకు వెనకాడుతోంది. గత నెల 21న ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) ఆధ్యక్షతన జరిగిన సమీక్ష అనంతరం తాజాగా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. కస్టం మిల్లింగ్ రైస్ - సీఎంఆర్ డెలివరీ, ధాన్యం మిల్లింగ్ సామర్థ్యం పెంపు తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
ధాన్యం వేలానికి కమిటీ నియమించిన ప్రభుత్వం : దశల వారీగా వేలం వేసి ధాన్యం విక్రయిస్తామని ఇటీవల శాసనసభలో కూడా తన ప్రసంగంలో సీఎం వెల్లడించిన విషయం తెలిసిందే. 2022-23 మిల్లింగ్ సామర్థ్యం పెంపు, మిగులు ధాన్యం వేలం వేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర స్థాయి కమిటీ - ఎస్‌ఎల్‌సీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఛైర్మన్‌గా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వ్యహరించనున్నారు. అలాగే, కమిటీ సభ్యులుగా పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి, సీఎంఓ కార్యదర్శి, టీఎస్‌ఐఐసీ ఎండీ, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ను నియమించింది.
Telangana Milling Industry : మిల్లింగ్ ఇండస్ట్రీలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు
Yasangi Paddy Open Auction In Telangana : రాష్ట్రంలో రైస్ మిల్లుల్లో ఎంత ధాన్యం నిల్వ ఉంది? ఎంత వేలం వేయవచ్చు? ధరల నిర్ణయం.. మిగులు ధాన్యం వేలం విధివిధానాల రూపకల్పనపై ఈ రాష్ట్ర స్థాయి కమిటీ నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మిల్లుల మిల్లింగ్ సామర్థ్యం పెంపొందించడం, తడిసి దెబ్బతిన్న మిగులు వరి వేలం కోసం పద్ధతుల తయారీ సంబంధించి ధాన్యం సేకరణ, పరిమాణం, అవసరమైన సామర్థ్యం, లోటు మిల్లింగ్ సామర్థ్యం ఉన్న ప్రాంతాలను గుర్తించడం ఈ కమిటీ విధి.
custom milling rice problems : కస్టమ్ మిల్లింగ్‌కు కష్టాలు.. గుట్టలుగా పేరుకుపోతున్న ధాన్యం బస్తాలు