DA hike for employees in Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఒక డీఏ మంజూరు
21:55 June 19
ప్రభుత్వ ఉద్యోగులకు 2.73 శాతం డీఏ పెంచుతూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ
Govt employees DA hike in telangana : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం ఒక డీఏ విడుదల చేసింది. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా డీఏ విడుదల చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఉద్యోగుల మూలవేతనం, పెన్షన్‌పై 2.73 శాతం డీఏ పెరగనుంది. పెరిగిన డీఏ 2022 జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానుంది. బకాయిలను తర్వాత విడుదల చేయనున్న ప్రభుత్వం.. జూన్ నెల వేతనం, పెన్షన్‌తో పాటు పెరిగిన డీఏను జులైలో చెల్లించనుంది.
ఈ మేరకు ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. డీఏ పెంపు నిర్ణయంతో రూ. 1380 కోట్ల బకాయిలు చెల్లించనున్నారు. డీఏ పెంపుతో ప్రభుత్వానికి నెలకు రూ. 81కోట్ల 18 లక్షలు.. సంవత్సరానికి రూ. 974 కోట్ల 16 లక్షల అదనపు భారం పడనుంది. ఈ పెంపుతో 7.28 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.
ఇవీ చదవండి: