Haritha nidhi : పచ్చదనం పెంపే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని ధీర్ఘకాలికంగా కొనసాగించేలా ఏర్పాటు చేసిన హరితనిధికి ఆయా వర్గాల విరాళాల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టులు, వాణిజ్య అనుమతులు, రిజిస్ట్రేషన్లు, విద్యార్థులు ఏడాదికి ఇవ్వాల్సిన విరాళం మొత్తాన్ని ఖరారు చేస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ల ఛైర్మన్లు ఏడాదికి రూ.6,000 విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్లు, మేయర్లు ఏడాదికి రూ.1200.... ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు రూ.600 విరాళంగా ఇవ్వాలి. ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, సర్పంచులు ఏడాదికి 120 రూపాయలు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. అఖిలభారత సర్వీసు అధికారులు ఏడాదికి రూ.1,200, ఇతర అన్ని రకాల ఉద్యోగులు ఏడాదికి 300 రూపాయలు విరాళంగా ఇవ్వాలి. వీరందరికి సంబంధించి ఏటా ఏప్రిల్ నెల వేతనం నుంచి విరాళంగా ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2022-33 ఆర్థిక సంవత్సరం నుంచి మే నెలలో ఇచ్చే ఏప్రిల్ వేతనాల నుంచి నిర్దేశిత మొత్తాన్ని తగ్గించి హరితనిధి ఖాతాకు జమ చేయాలని డ్రాయింగ్, అకౌంట్స్, ఫైనాన్స్ అధికారులకు స్పష్టం చేసింది.
అందరూ చెల్లించాల్సిందే..