రాష్ట్రంలో పలువురు అఖిల భారత సర్వీసు అధికారులకు పదోన్నతులు లభించాయి. పదోన్నతులు పొందిన వారిలో 33 మంది ఐఏఎస్, 10 మంది ఐపీఎస్, 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులు ఉన్నారు. 1990 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారులు శశాంక్ గోయల్, సునీల్ శర్మకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు. 1991 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు అధికారులను ఐఏఎస్ ఎపెక్స్ స్కేల్‌కు పదోన్నతి కల్పించేందుకు ప్యానెల్ చేశారు. రజత్ కుమార్, రామకృష్ణారావు, హర్ ప్రీత్ సింగ్, అర్వింద్ కుమార్, అశోక్ కుమార్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాకు అర్హత పొందారు. ఒకే ఖాళీ ఉన్న నేపథ్యంలో రజత్ కుమార్‌కు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతి కల్పిస్తూ పోస్టింగ్ ఇచ్చారు. తదుపరి ఖాళీలు వచ్చిన వెంటనే మిగతా వారికి కూడా స్పెషల్ సీఎస్‌లుగా పదోన్నతి కల్పిస్తారు. 1996 బ్యాచ్ అధికారులు దానకిశోర్, జనార్దన్ రెడ్డిలు ముఖ్య కార్యదర్శులుగా పదోన్నతి పొందారు. 2005 బ్యాచ్‌కు చెందిన గౌరవ్ ఉప్పల్, మాణిక్కరాజ్, చంపాలాల్, ఇలంబర్తిలకు కార్యదర్శులుగా అవకాశం కల్పించారు. 2006 బ్యాచ్‌కు చెందిన వెంకటరామిరెడ్డి, 2000 బ్యాచ్‌కు చెందిన శ్రీదేవసేనలు సెలక్షన్ గ్రేడ్ స్థాయికి పదోన్నతి పొందారు. 2011 బ్యాచ్‌కు చెందిన శ్వేతా మహంతి, పాటిల్ ప్రశాంత్ జీవన్, కిల్లు శివకుమార్ నాయుడు, 2012 బ్యాచ్‌కు చెందిన కృష్ణభాస్కర్, అలగు వర్షిణి, రాజీవ్ గాంధీ హన్మంతు, ఆర్వీ కర్ణన్, కొర్రా లక్ష్మీలకు జూనియర్ పరిపాలన గ్రేడ్ స్కేలుకు పదోన్నతి కల్పించారు. 2016, 2017 బ్యాచ్‌లకు చెందిన బదావత్ సంతోష్, ముజమ్మిల్ ఖాన్, మను చౌదరి, ఐలా త్రిపాఠి, రాహుల్ శర్మ, రాజర్షిషా, ప్రతీక్ జైన్, స్నేహలత, వెంకటేష్, బీఎం సంతోశ్లు సీనియర్ టైంస్కేలుకు పదోన్నతి పొందారు.
ఐపీఎస్ పదోన్నతులు: