Telangana Govt Focus On IAS, IPS Transfers :రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత పరిపాలనను గాడిన పెట్టేందుకు వీలుగా భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు ఉంటాయని తెలుస్తోంది. ప్రభుత్వం మారిన ప్రతిసారి ఆ ప్రభుత్వానికి అనుగుణంగా బదిలీలు చేయడం సర్వసాధారణం. కానీ తెలంగాణాలో ఏర్పాటైనకాంగ్రెస్‌ప్రభుత్వం ప్రజాపాలన, రాజ్యాంగబద్ద పాలన ప్రజలకు అందిస్తామని స్పష్టం చేస్తోంది. ఆ దిశలో ఇప్పటికే అడుగులు వేసింది.
ప్రగతిభవన్ వద్ద ఉన్నకంచను తొలిగించి దాని పేరు కూడా జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌గా మార్చడంతోపాటు అక్కడ ప్రజా దర్భార్ నిర్వహించే ప్రక్రియ కొనసాగిస్తోంది. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో అనేకం చేస్తూ ప్రజలకు చేరువయ్యే దిశలో ముందుకు వెళ్లాల్సి ఉండడంతో అందుకు అనుగుణంగా అధికారయంత్రాంగాన్ని సిద్ధం చేసుకునే పనిలో కొత్త ప్రభుత్వం ఉంది.
Officers Transfers in Telangana 2023 : త్వరలోనే ఆ 100 మంది అధికారుల బదిలీ..!
Govt Concentrates On IAs IPs Transfers: గత ప్రభుత్వ పాలన కంటే మెరుగైన రీతిలో ఉండేట్లు ప్రజాపాలన కొనసాగాలన్న ఆలోచనతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. అదే విధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలతోపాటు హామీలను అమలు చేయాల్సి ఉన్నందున అందుకు తగ్గట్లు చురుగ్గా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకునే అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసుకునే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇంటిలిజెన్స్ చీఫ్‌గా శివధర్ రెడ్డిని నియమించిన ప్రభుత్వం మిగిలిన ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు బదిలీలపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
Transfers IAS IPS Officers In Telangana: అయితే ఇప్పటికే కొందరు అధికారులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలుస్తున్నారు. మరికొందరు తమకు అనుకూలమైన, సీఎంకు దగ్గరగా ఉండే నాయకులను కలిసి కీలక స్థానాల్లో పోస్టింగ్‌లు దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో లూప్ లైన్ పోస్టుల్లో ఉన్నకొందరు అధికారులు కాంగ్రెస్‌కు మెజారిటీ స్థానాలు రాగానే సీఎంగా రేవంత్ రెడ్డినే అవుతారని భావించి సీనియర్ నాయకులను ముందస్తుగా కలిసినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ చాలా మంది ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు తమకు అనుకూలమైన పోస్టింగ్‌లు తెచ్చుకోడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.