తెలంగాణ

telangana

ETV Bharat / state

తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం - 54 కార్పొరేషన్‌ ఛైర్మన్‌ల నియామకాలు రద్దు

Telangana Govt Cancelled 54 Corportions Chirman Appointment : రాష్ట్రంలో నూతనంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా పలు కార్పొరేషన్‌ ఛైర్మన్ల నియామకాలను రద్దు చేసింది. ఈ మేరకు 54 కార్పొరేషన్‌ ఛైర్మన్‌ నియామకాలు రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Cancelled 54 Corportions Chirman Appointment
Telangana Govt Cancelled 54 Corportions Chirman Appointment

By ETV Bharat Telangana Team

Published : Dec 10, 2023, 7:48 PM IST

Updated : Dec 10, 2023, 9:51 PM IST

Telangana Govt Cancelled 54 Corportions Chirman Appointment : తెలంగాణ రాష్ట్రంలోని పలు కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో 54 కార్పోరేషన్ చైర్మన్ల(Corportion Chirman) నియామకాలను రద్దు చేసినట్లు సీఎస్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కార్పొరేషన్ చైర్మన్లలో ప్రధానమైన ఆర్టీసీ ఛైర్మన్‌ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌ అల్లం నారాయణ, రైతు బంధు సమితి ఛైర్మన్‌ తాటికొండ రాజయ్య, సివిల్ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ సర్ధార్‌ రవీందర్ సింగ్, రెడ్కో ఛైర్మన్‌ సతీశ్‌ రెడ్డి తదితరుల 54 కార్పొరేషన్ ఛైర్మన్‌ నియామకాలను రద్దు చేశారు.

Several Corporations Chairman Resigned in Telangana :రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ మెజార్టీ సీట్లు సాధించిన దగ్గర నుంచి కార్పొరేషన్‌ ఛైర్మన్లు రాజీనామా చేశారు. అలా వారితో పాటు ఇతర నామినేటెడ్‌ పదవులలో ఉన్న బీఆర్‌ఎస్ నేతు కూడా రాజీనామాలు చేశారు. ఇప్పటివరకు 16 మంది నేతలు లేఖలు సమర్పించారు. వారిలో ముఖ్యంగా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ రాజీనామా చేశారు. వారితో పాటు వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు భరత్​ కుమార్​, జూలూరి గౌరీ శంకర్​, పల్లె రవి కుమార్​ గౌడ్​, ఆంజనేయ గౌడ్​, దూది మెట్ల బాలరాజు యాదవ్​, గూడూరు ప్రవీణ్​, అనిల్​ కూర్మాచలం, వలియా నాయక్​, వై. సతీశ్​ రెడ్డి, మేడె రాజీవ్​ సాగర్​, రవీందర్​ సింగ్​, ఎర్రోళ్ల శ్రీనివాస్​, పాటిమీది జగన్మోహన్​ రావు తదితరులు తమ రాజీనామా లేఖలను సీఎస్​ శాంతికుమారికి సమర్పించారు.

CM KCR Resigned : ముఖ్యమంత్రి పదవికి కేసీఆర్ రాజీనామా - గవర్నర్ తమిళిసై ఆమోదం

Telangana Govt Advisers Appointments Cancelled : రెండు రోజుల క్రితం గత ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేస్తూ నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎస్‌ శాంతికుమారి ఉత్తర్వులను జారీ చేశారు. ఏడుగురు సలహాదారుల నియామకాలను రద్దు చేయగా, కొత్త ప్రభుత్వం ఏర్పడిన మరుసటి రోజు తెలంగాణ ట్రాన్స్​కో, జెన్​కో సీఎండీగా ఉన్న ప్రభాకర్​రావు రాజీనామా చేశారు. మరోవైపు టాస్క్​పోర్స్​ ఓఎస్డీ రాధాకిషన్​ రావు కూడా తన పదవికి రాజీనామా చేశారు. శాతవాహన అర్బన్​ డెవలప్​మెంట్​ అథారిటీ ఛైర్మన్​ సైతం రాజీనామా చేసి సీఎస్​కు లేఖ పంపారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ పరిషత్​ అధ్యక్షులుగా ఉన్న కేవీ రమణాచారి తన పదవులకు రాజీనామా చేశారు. ప్రభుత్వ సలహాదారుల నియామకాలను రద్దు చేసిన వారిలో సోమేశ్‌ కుమార్‌, చెన్నమనేని రమేశ్‌, రాజీవ్‌ శర్మ, అనురాగ్‌ శర్మ, ఏకే ఖాన్‌, జీఆర్ రెడ్డి, ఆర్‌. శోభ ఉన్నారు.

కార్పొరేషన్‌ ఛైర్మన్‌ల నియామకాలు రద్దు
కార్పొరేషన్‌ ఛైర్మన్‌ల నియామకాలు రద్దు
కార్పొరేషన్‌ ఛైర్మన్‌ల నియామకాలు రద్దు
కార్పొరేషన్‌ ఛైర్మన్‌ల నియామకాలు రద్దు

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం - ప్రభుత్వ సలహాదారుల నియామకాలు రద్దు

రాష్ట్రంలో పలువురు కార్పొరేషన్ల ఛైర్మన్ల రాజీనామాలు - సీఎస్​కు లేఖలు

Last Updated : Dec 10, 2023, 9:51 PM IST

For All Latest Updates

TAGGED:

Corrporation

ABOUT THE AUTHOR

...view details