తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana govt bans illegal liquor : అక్రమ మద్యానికి అడ్డుకట్ట.. ముమ్మర తనిఖీలు - Telangana govt bans illegal liquor

Telangana govt bans illegal liquor : రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. అక్రమ మద్యం సరఫరా, గుడుంబా తయారీకి అడ్డుకట్ట వేస్తే.. అమ్మకాలు పెరుగుతాయని నిర్ధరణకు వచ్చింది. అందుకోసం బహుముఖ వ్యూహంతో ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించింది. అబ్కారీ శాఖతోపాటు పోలీస్‌, రైల్వే పోలీసులు అక్రమమద్యం సరఫరాపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు చేపడుతున్నారు.

liquor
liquor

By

Published : May 29, 2023, 8:42 AM IST

అక్రమ మద్యానికి అడ్డుకట్ట.. ముమ్మర తనిఖీలు

Telangana govt bans illegal liquor : పొరుగురాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో మద్యం ధరలు 20 నుంచి 30శాతం వరకు అధికమని అబ్కారీ అధికారులు అంచనావేస్తున్నారు. ధర పెరగడంతో తక్కువ ధరకే.. మద్యం దొరికే రాష్ట్రాల నుంచి అక్రమార్కులు అనధికారికంగా రాష్ట్రానికి తీసుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. తద్వారా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పడిపోతున్నట్లు.. అబ్కారీశాఖ అధికారులు గుర్తించారు.

illegal liquorban in Telangana :రాష్ట్రంలో సగటున 90 నుంచి 100 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. అంతకంటే ఎక్కువ మద్యం విక్రయాలు జరగాల్సి ఉందని అబ్కారీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ధరలు పెంచినందున రోజుకు రూ100 నుంచి 120 కోట్ల విలువైన విక్రయాలు జరగాల్సి ఉన్నా అక్రమ మద్యం సరఫరా, గుడుంబా తయారీ వల్లే తగ్గుతుటున్నట్ల భావిస్తున్నారు. వాటిని పూర్తిస్థాయిలో కట్టడి చేస్తేనే.. తిరిగి రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మరింత ఊపందుకుంటాయంటున్నారు. ఈ దిశగా చర్యలు చేపడుతున్నారు.

డీజీపీతో జరిగిన సమీక్షలో అక్రమమద్యం, గుడుంబా తయారీసహా.. మాదకద్రవ్యాల సరఫరాపై చర్చించారు. ప్రధానంగా ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్న అక్రమ మద్యంపై.. కఠిన చర్యలు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. 2014 నుంచి ఇప్పటివరకు.. వివిధ రాష్ట్రాల నుంచి తెలంగాణకు అక్రమ మద్యం రవాణాచేస్తున్న 27,883 మందిపై కేసులు నమోదు చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 161 మందిపై కేసులు పెట్టడంతోపాటు.. పలుసార్లు అక్రమమద్యం సరఫరాచేస్తూ నేరాలకు పాల్పడుతున్న 15 మందిపై పీడీ చట్టం ప్రయోగించారు. ఏ రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం సరఫరా అవుతుంది.. ఎక్కడెక్కడ గుడుంబా తయారు చేస్తున్నారు..ఎక్కడికి సరఫరా చేస్తున్నారనే వివరాలను ఎక్సైజ్‌ శాఖ సేకరించింది.

అక్కడి నుంచే అక్రమ మద్యం.. బయటనుంచి వచ్చిన అక్రమ మద్యాన్ని హైదరాబాద్‌ శివారులోని ఇబ్రహీంపట్నం, ఆదిభట్ల, శంషాబాద్‌, హయత్‌నగర్‌, మేడ్చల్‌తోపాటు యాదాద్రి-భువనగిరి, చౌటుప్పల్‌ తదితర చోట్ల విక్రయిస్తున్నట్లు ఇటీవల పట్టుబడిన కొన్ని కేసుల విచారణలో తేలింది. ఆ వివరాలు ఆధారంగానే.. రాష్ట్ర వ్యాప్తంగా కఠిన చర్యలు చేపట్టే ప్రక్రియకు అధికారులు శ్రీకారం చుట్టారు. ఒడిషా, గోవా, హర్యానా, ధిల్లీ, చండీగఢ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ నుంచి.. తెలంగాణకు అక్రమ మద్యం రవాణా అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆయా రాష్ట్రాల నుంచి సరకు రాకుండా నిలువరించేందుకు సరిహద్దుల్లో జిల్లా పోలీసులు, స్థానిక ఎక్సైజ్‌ అధికారులు ప్రత్యేక తనిఖీ కేంద్రాలు ఏర్పాటుచేశారు. రాష్ట్రానికి చెందిన అక్రమ మద్యంసరఫరాదారులు, అంతరాష్ట్ర ముఠాలను గుర్తించి వారి కదలికలపై నిఘాపెట్టారు.

రైళ్లలో అక్రమ మద్యం సరఫరా కాకుండా.. జీఆర్​పీ సిబ్బంది తనిఖీలు చేస్తున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం బయట తనిఖీకి ఓ సహాయ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ నేతృత్వంలో నలుగురు ఇన్‌స్పెక్టర్లు, ఏడెనిమిది మంది సబ్‌ఇన్‌స్పెక్టర్లు 20 మందికిపైగా కానిస్టేబుళ్లు ఓ బృందంగా పనిచేస్తున్నట్లు అబ్కారీశాఖ అధికారులు తెలిపారు. బయట రాష్ట్రాల నుంచి మద్యంతెచ్చినట్లు గుర్తిస్తే కేసులు నమోదు చేసి.. దేశీయ విమాన ప్రయాణీకుల నుంచి మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుంటున్నారు. బయట రాష్ట్రాల నుంచి వస్తున్న బస్సులను మార్గమధ్యలో తనిఖీలు చేస్తున్న అధికారులు.. సరుకు తీసుకొస్తుంటే స్వాధీనం చేసుకుంటున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details