తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Govt Approves 5089 Teacher Posts : డీఎస్సీ ద్వారా 5,089 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి - తెలంగాణ డీఎస్సీ 2023

Telangana Govt Approves 5089 Teacher Posts
Telangana DSc 2023

By ETV Bharat Telangana Team

Published : Aug 25, 2023, 3:38 PM IST

Updated : Aug 25, 2023, 4:30 PM IST

15:33 August 25

Telangana Govt Approves 5089 Teacher Posts : 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి

Telangana Govt Approves 5089 Teacher Posts : తెలంగాణ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పచ్చజెండా ఊపింది. డీఎస్సీ(Telangana DSC 2023) ద్వారా 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయుల పోస్టుల భర్తీలో 2,575 ఎస్‌జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్, 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టులు భర్తీ చేయనున్నారు.

మరోవైపు సాంఘిక, సంక్షేమ గురుకుల పాఠశాలల్లోని కాంట్రాక్టు ఉపాధ్యాయుల క్రమబద్ధీకణకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయుల క్రమబద్ధీకరణకు పచ్చజెండా ఊపింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఒకటి లేదా రెండు రోజుల్లో ప్రభుత్వం జారీ చేయనుంది. ఇప్పటివరకు గత 16 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిలోనే.. ఈ పాఠశాలల్లోని ఉపాధ్యాయులు కొనసాగుతున్నారు. దీంతో వీరు ఇప్పుడు రెగ్యులర్​ ఉపాధ్యాయులుగా కొనసాగనున్నారు. సీఎం కేసీఆర్​ నిర్ణయం పట్ల ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్​ హర్షం వ్యక్తం చేశారు.

IBPS PO Jobs Apply Last Date : ఐబీపీఎస్​​ పీఓ, ఎస్​ఓ నోటిఫికేషన్​ .. దరఖాస్తుకు 3 రోజులే ఛాన్స్​!

ఉపాధ్యాయ పోస్టులను పెంచాలని బీఈడీ విద్యార్థుల ఆందోళన : ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా 13,500 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని.. నిరుద్యోగులు, బీఈడీ విద్యార్థులు హైదరాబాద్​లో ఆందోళనకు దిగారు. లక్డీకపూల్​లోని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కార్యాలయ ముట్టడికి పిలుపునివ్వడంతో.. పోలీసులు వారిని ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. అక్రమ అరెస్ట్​లను నిరసిస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన నిరుద్యోగులు గోషామహల్ స్టేడియంలో ఆందోళన కొనసాగించారు. గురువారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి 6,500పైగా పోస్టులకు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ వేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం కంటితుడుపుగా మినీ డీఎస్సీ నోటిఫికేషన్ వేసి నిరుద్యోగులను మోసం చేస్తోందని ఆరోపించారు.

FCI Jobs 2023 : ఫుడ్​ కార్పొరేషన్​లో 5000 ఉద్యోగాలు​.. వేలల్లో జీతం.. అప్లై చేసుకోండిలా!

Telangana DSC Notification 2023 :ఇదిలా ఉంటే గురువారం రాష్ట్రంలో టీచర్​ పోస్టుల భర్తీకి మరో రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటన విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్​లో 6,500కు పైగా పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో పాఠశాల విద్యకు సంబంధించి 5,089, స్పెషల్​ ఎడ్యుకేషన్​ స్కూళ్లలో 1,523 పోస్టులు ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.

TS Tet exam on 15th September :సెప్టెంబరు 15వ తేదీన టెట్​ పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పేపర్​-1 పరీక్ష నిర్వహించగా.. మధ్యాహ్నం 1.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్​-2 పరీక్షను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన హాల్​ టికెట్లను సెప్టెంబరు 9 నుంచి వెబ్​సైట్​లో అందుబాటులోకి ఉంచనున్నారు.

Telangana DSC Notification 2023 : 'రెండ్రోజుల్లో.. తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్'

Telangana TET 2023 : మరోసారి 'టెట్‌' నిర్వహణ.. మంత్రివర్గ ఉపసంఘం కీలక నిర్ణయం

Last Updated : Aug 25, 2023, 4:30 PM IST

ABOUT THE AUTHOR

...view details