కరుణ, సమానత్వం, ఐక్యత, సార్వజనీన సహోదరభావానికి మిలాద్ ఉన్ నబీ చిహ్నమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. శుక్రవారం ఈద్- మిలాద్ ఉన్ నబీని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా మహమ్మారి ఇప్పటికీ అదుపులోకి రానందున పండుగ సందర్భంగా అందరూ కొవిడ్ నిబంధనలను పాటిస్తూ ఉత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు: గవర్నర్ తమిళిసై - milad un nabi latest news
శుక్రవారం ఈద్-మిలాద్ ఉన్ నబీ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వ్యాప్తి చెందుతున్నందున ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.

ముస్లిం సోదరులకు మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు: గవర్నర్ తమిళిసై
ఈ పండుగ రోజున రాష్ట్రమంతటా శాంతి నింపాలని గవర్నర్ ప్రజలను కోరారు. సమాజంలో ఐక్యత, సామరస్యం, శాంతి, సోదర భావం, అభ్యుదయం వంటి వాటిని ప్రోత్సహించేందుకు అందరం తీర్మానించుకోవాలన్నారు.
ఇదీ చదవండిఃరాజ్‌భవన్‌లో బతుకమ్మ ఆడిన గవర్నర్ తమిళిసై