రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆగస్ట్ 15 మరచిపోలేని అంకితభావంతో కూడిన రోజని, కొన్ని తరాల నిస్వార్థ త్యాగానికి నిదర్శనమే మన స్వాతంత్ర పోరాటమని తమిళిసై అన్నారు. మనకు స్వేచ్ఛా ఫలాలను అందించేందుకు త్యాగాలు చేసిన దేశభక్తులను సంస్మరించుకునే రోజు స్వాతంత్ర్య దినోత్సవమని తెలిపారు.
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు - indepedence day wishes to telangana state by governor tamilisai
శనివారం స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్య ఫలాలను మనకు అందించేందుకు త్యాగాలు చేసిన దేశభక్తులను సంస్మరించుకునే రోజు స్వాతంత్ర్య దినోత్సవమని గవర్నర్ స్పష్టం చేశారు.
రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో పౌరులందరం కరోనా మార్గదర్శకాలను పాటిస్తామనే ప్రతిజ్ఞను పూనుకుందామన్న గవర్నర్... ప్రజలందరూ సురక్షితంగా పంద్రాగస్టు వేడుకలను జరుపుకోవాలని సూచించారు. మన దేశాన్ని బలమైన, సురక్షితమైన, స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దేందుకు ఈ సందర్భంగా తీర్మానించుకుందామని గవర్నర్ తమిళిసై కోరారు.