రాష్ట్ర ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు త్యాగానికి గుడ్‌ఫ్రైడే ప్రతీక అని పేర్కొన్నారు. తన ప్రజల కోసం జీసెస్ చూపిన త్యాగనిరతి, ప్రేమ మరువలేదనిదని గుర్తుచేశారు. కోవిడ్ మహమ్మారిని జయించే మనోధైర్యం మనందరికీ ఇవ్వాలని ఈ సందర్భంగా గవర్నర్ ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రజలకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు: గవర్నర్ - Telangana Governor Tamilisai Wishes to Good friday
గుడ్ ఫ్రైడే, ఈస్టర్ సండే వేడుకల్ని క్రైస్తవ సోదర సోదరీమణులంతా ఇళ్లలో, కుటుంబసభ్యులతో ఘనంగా జరుపుకోవాలని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ పేర్కొన్నారు. కోవిడ్ నుంచి మానవాళిని రక్షించాలని కరుణామయుడిని మనమంతా ప్రార్థించాలని ఆమె ఆకాంక్షించారు.
రాష్ట్ర ప్రజలకు గుడ్ ఫ్రైడే శుభాంక్షలు: గవర్నర్