విద్యార్థుల పరిశోధనలు నిలిచిపోకూడదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అభిప్రాయపడ్డారు. అమ్మాయిలంతా వివాహం అయ్యాక కూడా తమకు నచ్చిన రంగాల్లో రాణించాలని సూచించారు.
విద్యార్థుల పరిశోధనలు ఆగకూడదు: గవర్నర్ తమిళిసై - గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
ఆవిష్కరణకు అంతం లేదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రతిరంగంలో నూతన ఆవిష్కరణలు జరగాలని చెప్పారు. హైదరాబాద్ నిజాం కళాశాలలో బయోటెక్నాలజీ సదస్సుకు ముఖ్య అతిథిగా తమిళిసై హాజరయ్యారు.
'విద్యార్థుల పరిశోధనలు నిలిచిపోకూడదు'
హైదరాబాద్ నిజాం కళాశాలలో బయోటెక్నాలజీ సదస్సుకు ముఖ్య అతిథిగా తమిళిసై హాజరయ్యారు. బయోటెక్నాలజీ రంగం ప్రస్తుత పరిస్థితి-భవిష్యత్ అవకాశాలపై నిర్వహించిన సదస్సులో పాల్గొన్నారు.
రోజురోజుకూ జీవనసాంకేతిక రంగంలో ఎన్నో మార్పులొస్తున్నాయని తమిళిసై పేర్కొన్నారు. సరికొత్త విషయాల పట్ల అవగాహన పెంచుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఇటువంటి సదస్సులను ఉపయోగించుకుని సరికొత్త ఆవిష్కరణల వైపు కదం తొక్కాలని చెప్పారు.
- ఇదీ చూడండి : ఆ కాఫీ తాగితే... పది మందితో తాగిస్తారు!
Last Updated : Nov 15, 2019, 3:21 PM IST