జమ్ము కశ్మీర్‌లోని సరిహద్దుల్లో ఉగ్రదాడిలో వీరమరణం పొందిన తెలుగు రాష్ట్రాలకు చెందిన జవాన్లకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. దేశం కోసం, దేశ రక్షణకు అహర్నిశలు పాటుపడుతున్న సైనికుల మరణం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు.
సైనికుల సాహసోపేత సర్వోన్నత త్యాగాలకు వందనం: తమిళిసై - గవర్నర్ తమిళి సై సంతాపం వార్తలు హైదరాబాద్
జమ్ము కశ్మీర్ ఉగ్రదాడిలో వీరమరణం పొందిన తెలుగు రాష్ట్రాలకు చెందిన సైనికులకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిజామాబాద్‌కు చెందిన మహేశ్, చిత్తూరుకు చెందిన ప్రవీణ్ సరిహద్దుల్లో ముష్కర దాడుల్లో అమరులవడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. దేశసార్వభౌమత్వాన్ని కాపాడడం కోసం నిరంతరం కృషి చేస్తూ ఆదర్శప్రాయంగా జవాన్లు నిలిచారు అని ట్వీట్ చేశారు.
నిజామాబాద్‌కు చెందిన మహేశ్, చిత్తూరుకు చెందిన ప్రవీణ్ సరిహద్దుల్లో ముష్కర దాడుల్లో అమరులవడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. సరిహద్దు ప్రాంతంలోనే కుప్వారా సెంటర్ వద్ద ఉగ్రవాదులపై దాడి చేస్తున్న క్రమంలో వారు అసువులుబాసినట్లు తెలిపారు. జవాన్ల కుటుంబాలకు ఆమె ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడడం కోసం నిరంతరం కృషి చేస్తూ ఆదర్శప్రాయంగా జవాన్లు నిలిచారు అని ట్వీట్ చేశారు. సైనికుల సాహసోపేత సర్వోన్నత త్యాగాలకు ఆమె వందనం తెలియజేశారు.
ఇదీ చదవండి:'చిన్నప్పటి నుంచి సైన్యంలో చేరాలన్న తపనే'