బాండ్ల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరో వెయ్యి కోట్లను సమీకరించుకోనుంది. ఈ మేరకు ఆర్థికశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. రిజర్వ్ బ్యాంక్ ద్వారా ఈ నెల 29న బాండ్లను వేలం వేయనున్నారు. రూ.1,029 కోట్ల రూపాయల విలువైన బాండ్లను 14 ఏళ్ల కాలపరిమితితో జారీ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇదే చివరి రుణం కానుంది.
Telangana Loan: మరో వెయ్యి కోట్ల రుణం తీసుకోనున్న తెలంగాణ సర్కారు - మరో వెయ్యి కోట్ల రుణం తీసుకోనున్న తెలంగాణ సర్కారు
Telangana Loan: రాష్ట్ర అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం మరి కొంత సొమ్ము రుణంగా తీసుకోనుంది. రిజర్వ్‌బ్యాంకు ఈనెల 29న వేయనున్న బాండ్ల వేలంలో మరో రూ.1,029 వేల కోట్లను రుణంగా సమీకరించుకోనుంది.
![Telangana Loan: మరో వెయ్యి కోట్ల రుణం తీసుకోనున్న తెలంగాణ సర్కారు TELANGANA GOVERNMENT TO BORROW ANOTHER RS 1000 CRORE FROM RESERVE BANK BANDS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14837808-62-14837808-1648225276953.jpg)
మరో వెయ్యి కోట్ల రుణం తీసుకోనున్న తెలంగాణ సర్కారు
2021-22లో రుణాల ద్వారా 47,500 కోట్ల రూపాయలు సమకూర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. కాగ్‌కు ఇచ్చిన వివరాల ప్రకారం జనవరి నెలాఖరు వరకు 44,365 కోట్ల రూపాయలను రుణంగా తీసుకొంది. ఫిబ్రవరి నెలతో పాటు మార్చిలోనూ ఇంకొంత మొత్తాన్ని అప్పుగా తీసుకొంది. తాజాగా ఆర్థిక సంవత్సరం చివర్లో మరో 1029 కోట్లను సమీకరించుకోనుంది.
ఇదీ చదవండి :KTR IN US: దేశానికే గర్వకారణం తెలంగాణ: మంత్రి కేటీఆర్