ఐటీ కార్యదర్శి జయేష్ రంజన్ బహిరంగంగానే రాష్ట్ర ప్రజల డేటా తమ దగ్గర ఉన్నాయని చెప్పడంపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయట్లేదని పీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. ఇటీవలే జరిగిన ఐటీ గ్రిడ్ ఉదంతాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇదంతా కూడా ప్రజల వ్యక్తిగత వివరాల చౌర్యం కిందకు వస్తుందని శ్రవణ్ అన్నారు. రాష్ట్ర ప్రజానీకానికి తెలియకుండా గోప్యమైన వివరాలను తస్కరించడం ఆర్టికల్ 21 ప్రకారం నేరమని..ఇది రాజ్యాంగం ఉల్లంఘన కిందకు వస్తుందని స్పష్టం చేశారు.
'తెలంగాణ సర్కార్ ప్రజలను బెదిరింపులకు గురిచేస్తోంది'
ప్రజామోదం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగత వివరాలను దొంగలించి ప్రజలను బెదిరింపులకు గురిచేస్తోందని కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. వెంటనే ఐటీ శాఖ కార్యదర్శి జయష్ రంజన్‌పై కేసు నమోదు చేయాలన్నారు.
గోప్యమైన వివరాలను తస్కరించడం ఆర్టికల్ 21 ప్రకారం నేరం : శ్రవణ్