ఇళ్ల వద్దనే ప్రయాణికులను ఎక్కించుకునేందుకు వీలుగా వంద మిని బస్సులు కొనుగోలు చేయాలని గతంలో సీఎం కేసీఆర్ సూచించారు. వజ్ర పేరిట 2017లో ఆ బస్సులు ఆర్టీసీకి చేరాయి. వరంగల్, కామారెడ్డి, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్లోని 3 డిపోల నుంచి వజ్ర బస్సులను నడిపారు. కానీ.. ఆశించిన స్థాయిలో ప్రజల ఆదరణ లభించలేదు.
పెట్టుబడిలో 30శాతం కూడా రాలేదు...
నష్టాలు వచ్చే రూట్లలో బస్సులను నియంత్రించాలని సీఎం కేసీఆర్ తాజాగా స్పష్టం చేయటం వల్ల... వజ్ర బస్సులకు బ్రేక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక్కో బస్సును రూ.20 లక్షలతో కొనుగోలు చేయగా.. ఇప్పటి వరకూ ఒక్కో బస్సు 3 లక్షల కిలోమీటర్లు మేర మాత్రమే నడిచినట్లు సమాచారం. వజ్ర బస్సులపై పెట్టిన పెట్టుబడిలో 30 శాతం కూడా రాలేదని సమాచారం.