తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా చికిత్సకు అధిక బిల్లులు వేసిన ఆస్పత్రిపై చర్యలు - కరోనా చికిత్సకు అధిక బిల్లులు వేసిన ఆస్పత్రిపై వేటు

telangana-government-taken-action-on-deccan-hospital
కరోనా చికిత్సకు అధిక బిల్లులు వేసిన ఆస్పత్రిపై ప్రభుత్వం చర్యలు

By

Published : Aug 3, 2020, 8:16 PM IST

Updated : Aug 3, 2020, 9:31 PM IST

20:13 August 03

కరోనా చికిత్సకు అధిక బిల్లులు వేసిన ఆస్పత్రిపై ప్రభుత్వం చర్యలు

కరోనా చికిత్సకు అధిక బిల్లులు వేసిన ఆస్పత్రిపై ప్రభుత్వం చర్యలు

కరోనా చికిత్సకు అధిక బిల్లులు వేసిన ఆస్పత్రిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సోమాజిగూడ డెక్కన్ ఆస్పత్రిలో కరోనా చికిత్స అనుమతిని ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా రోగులకు అధిక బిల్లులు వేసినట్లు డెక్కన్ ఆస్పత్రిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. 

డెక్కన్ ఆస్పత్రిలో కొత్తగా కరోనా కేసులు అడ్మిట్ చేయొద్దని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న రోగులకు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు వసూలు చేయాలని తెలిపింది. ఈ మేరకు ప్రజా ఆరోగ్య సంచాలకుల కార్యాలయం నుంచి నోటీసులు వెలువరించారు.

ఇదీ చూడండి :రాఖీల కోసం బయటికెళ్లలేదు..కానీ పండుగ జరుపుకున్నారు

Last Updated : Aug 3, 2020, 9:31 PM IST

ABOUT THE AUTHOR

...view details