తెలంగాణ

telangana

ETV Bharat / state

రైతుబంధు సొమ్ము జమవుతోంది: మంత్రి సింగిరెడ్డి - oil palm cultivation Said by Minister Nirajanreddy

ఆయిల్‌పామ్‌ సాగును తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. అధిక దిగుబడినిచ్చే ఈ పంటను రాష్ట్రంలో ప్రస్తుతం 245మండలాల్లో సాగు చేస్తున్నట్లు వెల్లడించారు. అర్హులైన రైతులందరికీ ఖాతాలలో రైతుబంధు పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతున్నాయని తెలిపారు.

Telangana government subsidies for oil palm cultivation Said by Minister Nirajanreddy
'ఆయిల్​ పామ్ సాగుకు ప్రభుత్వం పెద్దపీట'

By

Published : Feb 22, 2020, 7:21 PM IST

ఆయిల్‌పామ్‌ సాగుకు ప్రభుత్వం రాయితీలు ఇస్తున్నప్పటికీ రైతులు ముందుకు రావడం లేదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. 15 మిలియన్‌ టన్నుల నూనెను విదేశాల నుంచి కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. మన దేశంలోనే నూనె గింజల సాగు పెరిగితే భారీగా విదేశీ మారకద్రవ్యం మిగులుతుందని అభిప్రాయపడ్డారు. ఆయిల్‌పామ్‌ సాగు భారీగా పెరగాల్సి ఉందని పేర్కొన్నారు. రైతులందరూ ఒకే తరహా పంటలు వేస్తున్నందువల్లే గిట్టుబాటు ధర, పంట విక్రయాల్లో సమస్యలు వస్తున్నాయని తెలిపారు.

అర్హులైన రైతులందరికీ ఖాతాల్లో రైతుబంధు పథకానికి సంబంధించిన డబ్బులు జమ అవుతున్నాయని తెలిపారు. కొన్నిచోట్ల సాంకేతిక లోపం వల్ల నిధులు బదిలీ కావడం లేదని వెల్లడించారు. ఈ పథకం అమలు కోసం ప్రత్యేక సెల్​ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పంటరుణాలకు సంబంధించి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచాలని కేంద్రాన్ని కోరినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని తెలిపారు. ఈ విషయంపై ఆరోపణలు చేసే వివక్ష నేతలు ఆధారాలు చూపించాలని సవాల్ విసిరారు.

'ఆయిల్​ పామ్ సాగుకు ప్రభుత్వం పెద్దపీట'

ఇవీచూడండి:'వ్యవసాయ రంగాన్ని కాపాడుకునేందుకు అందరి కృషి అవసరం'

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details