Telangana Government Stops Sanctioned Works Before Elections :కేసీఆర్ సర్కార్ ఎన్నికలకు ముందు ఇచ్చిన మంజూరీలు, టెండర్లపై రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) దృష్టి సారించింది. శాసనసభ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు తెలంగాణ వ్యాప్తంగా మెజార్టీ నియోజకవర్గాల్లో వివిధ పనుల కోసం మంజూరీలు ఇచ్చారు. ఆయా శాఖలతో పాటు ముఖ్యమంత్రి వద్ద ఉండే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రత్యేక నిధి - ఎస్డీఎఫ్ నుంచి కూడా పెద్ద ఎత్తున పనులు మంజూరు చేశారు.
కొన్ని నియోజకవర్గాల్లో వందల కోట్లకు పైగా పనులు :కొన్ని నియోజకవర్గాల్లో వందల కోట్లకు పైగా, ఈ తరహా పనులు మంజూరయ్యాయి. అందులో కొన్ని పనులు ప్రారంభమై వివిధ దశల్లో ఉండగా, మరికొన్ని ప్రారంభం కాలేదు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ గెలుపొంది, కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరుణంలో పరిస్థితులు మారిపోయాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా సర్కార్ ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వివిధ పనుల మంజూరీలు, ఇంకా ప్రారంభం కాని పనులను ఆపివేయాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.
Sanctioned Works Before Elections Stopped in Telangana : ఈ మేరకు ప్రణాళికా శాఖ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక అభివృద్ధి నిధి కింద మంజూరైన పనులు, వాటి ప్రస్తుత స్థితి, ఇప్పటివరకు చేసిన వ్యయం, ఇంకా అవసరమయ్యే ఖర్చు, తదితరాల వివరాలు పంపాలని ఆదేశించింది. ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మంజూరైన పనులు, ప్రారంభం కాని అన్నింటినీ ఆపివేయాలని అందులో స్పష్టం చేసింది.
ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేయండి - అధికారులతో జూపల్లి
తెలంగాణ సివిల్ సప్లై కార్పొరేషన్ మొత్తం అప్పులు రూ.56వేల కోట్లు : ఉత్తమ్