కేంద్ర వార్షిక బడ్జెట్‌తో రాష్ట్రానికి వచ్చే నిధుల విషయంలో స్పష్టత వచ్చింది. కేంద్రం చేసిన కేటాయింపుల ప్రకారం రాష్ట్రానికి ఏ మేరకు నిధులు వస్తాయన్న విషయమై అధికారులు ఓ అంచనాకు వచ్చారు. బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న ప్రాధాన్యతలు, రాష్ట్రంపై వాటి ప్రభావం ఎంత ఉంటుందన్న విషయమై కొంత అవగాహనకు వచ్చారు.
గ్రాంట్ల విషయంలో స్పష్టత..
15వ ఆర్థిక సంఘం సిఫార్సుల ఆమోదంతో పన్నుల్లో రాష్ట్ర వాటాతో పాటు.. రానున్న ఐదేళ్ల కాలానికి కేంద్రం నుంచి వివిధ రూపాల్లో వచ్చే నిధులు, గ్రాంట్ల విషయంలో స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తును ఆర్థికశాఖ వేగవంతం చేయనుంది. కొవిడ్, లాక్‌డౌన్ నేపథ్యంలో భారీగా పడిపోయిన ఆదాయాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. డిసెంబర్, జనవరి నెలల్లో ఖజానాకు రాబడి బాగానే ఉంది. ఎక్సైజ్, జీఎస్టీ, అమ్మకం పన్ను బాగానే రాగా.. రిజిస్ట్రేషన్ల ఆదాయం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో రెండు నెలలు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో ఈ ఏడాది ఆదాయ, వ్యయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఓ అవగాహనకు వచ్చింది.
బడ్జెట్‌పై కరోనా ప్రభావం..