రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. ఉచిత డయాగ్నోస్టిక్ సెంటర్లకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 19జిల్లాల్లో బుధవారం ఈ పరీక్షా కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఆయా జిల్లాల మంత్రులు, ముఖ్యనేతలు వీటిని ప్రారంభించారు. మహబూబ్‌నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేటతోపాటు జనగామ, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో ఉచిత వైద్యపరీక్షలు అందుబాటులోకి వచ్చాయి. భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, నల్గొండ, ఖమ్మం, సిరిసిల్లతోపాటు..., వికారాబాద్, నిర్మల్, కరీంనగర్, ఆదిలాబాద్, జోగులాంబ గద్వాల, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల్లో సేవలు ప్రారంభమయ్యాయి.
ప్రారంభించిన మంత్రులు, ముఖ్య నేతలు
నల్గొండలో డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి జగదీశ్ రెడ్డి... తెరాస పాలనలో ప్రభుత్వ వైద్యంపై ప్రజల్లో నమ్మకం పెరిగిందన్నారు. జోగులాంబ గద్వాలలో ఉచిత వైద్యపరీక్షల కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి నిరంజన్‌రెడ్డి.. ప్రజలకు ఏది అవసరమో అది చేరువ చేసేందుకే ముఖ్యమంత్రి నిరంతరం కృషి చేస్తున్నారని కొనియాడారు. ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఖమ్మంలో ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి పువ్వాడ అజయ్ కుమార్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభించారు. వైద్యం కంటే ఖరీదైపోతున్న వైద్యపరీక్షలను ప్రభుత్వం పేదలకు చేరువ చేస్తోందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వికారాబాద్‌లో పేర్కొన్నారు. ములుగులో మంత్రి సత్యవతి రాఠోడ్ డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని అందుబాటులోకి తెచ్చారు. మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ వైద్యపరీక్షల కేంద్రాన్ని ప్రారంభించారు. సంగారెడ్డిలో డయాగ్నోస్టిక్ సెంటర్‌ను ప్రారంభించిన మంత్రి హరీశ్‌రావు.. అతిత్వరలో మరో 16 సెంటర్లు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు.
అన్ని రకాల టెస్టులు