ప్రభుత్వ స్టాఫ్ నర్సు పోస్టుల ఫలితాలు విడుదల - ts Government Staff Nurse Posts Results 2023
Telangana Government Staff Nurse Posts Results 2023 : రాష్ట్రంలో ప్రభుత్వ స్టాఫ్ నర్సు పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. టీఎస్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ వెబ్‌సైట్‌లో ప్రాథమిక జాబితాను ఉంచారు. గత ఆగస్టులో స్టాఫ్ నర్సు పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
Published : Dec 18, 2023, 6:41 PM IST
|Updated : Dec 18, 2023, 7:54 PM IST
Telangana Government Staff Nurse Posts Results 2023 : స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల ఫలితాలను రాష్ట్ర మెడికల్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ విడుదల చేసినట్టు ప్రకటించింది. ఈ ఏడాది ఆగస్టులో 7094 స్టాఫ్ నర్స్ పోస్టులకు బోర్డ్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. సుమారు 40 వేల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షల్లో అభ్యర్థులు సాధించిన పాయింట్లతో కూడిన ప్రొవిజన్ లిస్ట్ బోర్డ్ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు స్పష్టం చేసింది. అయితే అభ్యర్థులు సాధించిన పాయింట్లపై అభ్యంతరాలను ఈ నెల 20లోపు వెబ్‌సైట్‌లో పేర్కొనవచ్చు అని స్పష్టం చేసింది.