Gandhi Movie free show:స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థుల కోసం గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణ థియేటర్లు, మల్టీఫ్లెక్స్‌లలోనూ ఉదయం 10 నుంచి మధ్యాహ్నాం 1.15 గంటల వరకు చిత్రాన్ని ప్రదర్శించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
'గాంధీ' సినిమా ఉచిత ప్రదర్శన.. ప్రభుత్వం ఉత్తర్వులు - Gandhi Movie free show
Gandhi Movie free show:స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించాలని నిర్ణయించిన ప్రభుత్వం... ఈమేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 9 నుంచి 11 వరకు, తర్వాత 16 నుంచి 21 వరకు అన్ని థియేటర్లలో.. గాంధీ చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించాలని ఆదేశించింది.
'గాంధీ' సినిమా ఉచిత ప్రదర్శన.. ప్రభుత్వం ఉత్తర్వులు
ఈనెల 9 నుంచి 11 వరకు, 16 నుంచి 21 వరకు అన్ని థియేటర్లలోనూ ఉచిత ప్రదర్శన చేయాలని ఆదేశిస్తూ ప్రత్యేక మెమో జారీ చేసింది. థియేటర్లలో సినిమా ప్రదర్శనకు అనుకూలమైన ఫార్మెట్‌ను డిజిటల్ సర్వీసు ప్రొవైడర్లైన క్యూబ్, యూఎఫ్ఓలకు అందజేయాలని చలన చిత్ర అభివృద్ధి సంస్థకు సూచించింది. ఈ సినిమాను తప్పనిసరిగా ప్రదర్శితమయ్యేలా సంబంధిత అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
ఇవీ చూడండి: