తెలంగాణ

telangana

ETV Bharat / state

బియ్యం రాయితీకి నిధులు విడుదల చేసిన ప్రభుత్వం - బియ్యం సబ్సిడీ నిధుల విడుదల వార్తలు

ప్రస్తుత ఆర్థిక సంవత్సం 2020-21 మూడు, నాలుగో త్రైమాసికానికి సంబంధించి బియ్యం రాయితీకి రూ.1,143.5 కోట్లను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు నిధులు విడుదల చేయాలని పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

telangana government releases rice subsidy funds
బియ్యం రాయితీకి రూ. 1,143.45 కోట్ల నిధులు విడుదల

By

Published : Nov 9, 2020, 1:36 PM IST

బియ్యం రాయితీకి తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడు, నాలుగో త్రైమాసికానికి సంబంధించి రూ.1,143.45 కోట్లను విడుదల చేసింది. ప్రజాపంపిణీ వ్యవస్థ బియ్యం కొనుగోళ్లు, రాయితీ కోసం 2020-21 ఆర్థిక సంవత్సం బడ్జెట్​లో రూ.2,286.90 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది.

ఈ ఆర్థిక సంవత్సంలో ఇప్పటివరకు మొత్తం రూ.1,143.45 కోట్లు విడుదల చేయగా.. మిగిలిన సగం మొత్తాన్ని తెలంగాణ సర్కార్ ఇవాళ విడుదల చేసింది. ఈ మేరకు నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండిఃప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం చేసి ప్లాట్లుగా మార్చేస్తున్నారు!

ABOUT THE AUTHOR

...view details