వైద్య, ఆరోగ్యశాఖకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. వివిధ విభాగాలకు నిధుల విడుదల చేస్తూ పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు దఫాలకు సంబంధించిన నిధుల విడుదలకు అనుమతిచ్చింది.
వైద్యారోగ్య శాఖకు ప్రభుత్వం నిధులు విడుదల - Telangana Government releases funds
తెలంగాణ ప్రభుత్వం వైద్యారోగ్యశాఖకు నిధులను విడుదల చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌కు 796.96 కోట్లు, ప్రజారోగ్య శాఖ సంచాలకులకు 168.98 కోట్లు నిధులు మంజూరు చేశారు. వైద్యవిద్యా సంచాలకులకు 813.27 కోట్లు, వైద్యవిధాన పరిషత్ కమిషనర్‌కు 297.41 కోట్లు, నిమ్స్ ఆసుపత్రికి 109.75 కోట్లు మంజూరు చేశారు. యోగాధ్యాయన పరిషత్‌కు 16.36కోట్లు, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రికి 40.46 కోట్లు, ఆయుర్వేద, యోగ సంచాలకులకు 11.80 కోట్ల విడుదలకు అనుమతిచ్చారు. వీటితో పాటు ఇతర విభాగాలకు కూడా నిధులు మంజూరు చేశారు. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చూడండి:కరోనా మృతులకు 'మెర్సీ ఏంజెల్స్' అంత్యక్రియలు