ఉపాధి హామీ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ. 139 కోట్ల 59 లక్షలను విడుదలకు అనుమతిస్తూ.. పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఈనెల 18న ఆర్థిక శాఖ ఇచ్చిన బీఆర్ఓకు అనుగుణంగా పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉపాధి హామీ పథకానికి నిధులు విడుదల - Telangana government releases funds for employment scheme
ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం రూ.139 కోట్ల 59 లక్షల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఉపాధి హామీ పథకానికి నిధులు విడుదల
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉపాధిహామీ పథకానికి 1,780 కోట్ల 56 లక్షల రూపాయలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో బడ్జెట్లో చేసిన కేటాయింపులు మొత్తం విడుదల చేసినట్లైంది.