ఆసరా ఫించన్ల చెల్లింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థికసంవత్సరం మూడో త్రైమాసికం కోసం 2,931కోట్ల 17 లక్షల రూపాయలను విడుదల చేసింది.
ఆసరా పింఛన్లకు నిధులు విడుదల.. ఎంతంటే? - తెలంగాణ తాజా వార్తలు
ఆసరా పింఛన్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.2931.17 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి నిధులను విడుదల చేస్తున్నట్లు పేర్కొంది.
![ఆసరా పింఛన్లకు నిధులు విడుదల.. ఎంతంటే? telangana government-released-funds-for-aasara-pensions-for-next-quarter](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9000199-607-9000199-1601480266807.jpg)
ఆసరా పింఛన్లకు నిధులు విడుదల.. ఎంతంటే?
ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది బడ్జెట్లో ఆసరా ఫించన్ల కోసం 11వేల 274 కోట్ల రూపాయలు కేటాయించగా... ఇప్పటి వరకు 5వేల 862 కోట్ల రూపాయలు విడుదల చేశారు. తాజాగా మరో 2వేల 931కోట్ల రూపాయలను విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇదీ చూడండి :తరాలు మారిన తీరని సమస్యలు.. అమలుకు నోచుకోని హామీలు