తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆసరా పింఛన్లకు రూ. 11 వేల 508 కోట్లు మంజూరు - అసరా పింఛన్ల వార్తలు

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా పింఛన్ల పథకానికి నిధులు మంజూరయ్యాయి. ఏడాదికయ్యే మొత్తానికి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. బడ్జెట్​లో చేసిన కేటాయింపులకు అనుగుణంగా 11,508 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులు ఇచ్చింది.

pensions
పింఛన్లు

By

Published : Apr 17, 2021, 10:50 PM IST

ఆసరా పింఛన్ల కోసం ఏడాదికయ్యే మొత్తానికి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. బడ్జెట్‌లో చేసిన కేటాయింపులకు అనుగుణంగా 11వేల 508 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులు ఇచ్చింది.

ఆర్థికశాఖ ఉత్తర్వుల ప్రకారం వివిధ రకాల పింఛన్లకు అవసరమైన మొత్తాన్ని మంజూరు చేసింది. వృద్ధాప్య, దివ్యాంగులకు పింఛన్లతో పాటు బీడీ కార్మికులకు భృతి, ఒంటరి మహిళలకు ఆర్థికసాయం, బోధకాల వ్యాధి గ్రస్తులకు సాయం, గీత, నేత కార్మికులకు పించన్లు ఇచ్చేందుకు నిధుల విడుదలకు పరిపాలనా అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చదవండి:ఐఏఎస్​ అధికారినంటూ కోటి రూపాయలు వసూల్..

ABOUT THE AUTHOR

...view details