మిషన్ భగీరథ కోసం తీసుకున్న రుణానికి సంబంధించిన అసలుతో పాటు వడ్డీ చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. బడ్జెట్ కేటాయింపుల్లో నుంచి రూ. 1,740 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థిక సంస్థలు, వాణిజ్య బ్యాంకుల వద్ద నుంచి తీసుకున్న రుణాల అసలు, వడ్డీ చెల్లింపుల్లో భాగంగా గ్రామీణ నీటి సరఫరా విభాగం చీఫ్ ఇంజినీర్‌కు ఈ మొత్తాన్ని విడుదల చేశారు.
'మిషన్ భగీరథ'కు రూ.1,740 కోట్లు - మిషన్ భగీరథ వార్తలు
మిషన్ భగీరథ పథకం అప్పులు, వడ్డీల చెల్లింపుల్లో భాగంగా... రూ.1,740కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు.
'మిషన్ భగీరథ'కు రూ.1,740 కోట్లు
అటు సాగునీటి ప్రాజెక్టుల కోసం జలవనరుల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ద్వారా తీసుకున్న రుణానికి సంబంధించిన వడ్డీ చెల్లింపుల కోసం రూ. 581 కోట్లు విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి రెండు త్రైమాసికాలకు సంబంధించి నిధులు ఇచ్చారు. ఈ మేరుకు నీటిపారుదల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదీ చూడండి:భగీరథ ప్రయత్నం ఫలించింది.. అగ్రభాగాన నిలిచింది..!