మీడియా హక్కులు, పరిధిపై విస్తృతంగా విచారణ జరగాల్సి ఉందని హైకోర్టు పేర్కొంది. న్యాయస్థానం తెరిచాక పూర్తిస్థాయి విచారణ చేపడతామని వెల్లడించింది. సచివాలయం కూల్చివేతల కవరేజీకి అనుమతి ఇవ్వాలన్న పిటిషన్‌పై విచారించిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
మీడియా హక్కులు, పరిధిపై విస్తృత విచారణ అవసరం: హైకోర్టు - సచివాలయం కూల్చివేత కేసులు
మీడియా హక్కులు, పరిధిపై విస్తృతంగా విచారణ జరగాల్సిన అవసరం ఉందని హైకోర్టు అభిప్రాయపడింది. సచివాలయం కూల్చివేతల కవరేజీకి అనుమతి ఇవ్వాలన్న పిటిషన్‌పై విచారించిన హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. న్యాయస్థానం తెరిచాక పూర్తిస్థాయి విచారణ చేపడతామని వెల్లడించింది. సచివాలయం కూల్చివేత కవరేజీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం శుభపరిణామమని పేర్కొంది.
సచివాలయం కూల్చివేత కవరేజీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం మంచి పరిణామమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అప్పుడప్పుడు జర్నలిస్టులను అక్కడికి అనుమతించాలని పేర్కొంది. అయితే తాము కోరుకున్నప్పుడు కవర్ చేసేలా నిరంతరం స్వేచ్ఛ ఉండాలని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ముందు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టూర్‌లో వెళ్లాలని పిటిషనర్‌కు హైకోర్టు సూచించింది. ఈ అంశంలో తలెత్తిన పలు అంశాలపై పూర్తి స్థాయి విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
ఏ ప్రాతిపదికన పోలీసులను సచివాలయం వద్ద మోహరించారని ప్రశ్నించింది. ఇలాంటి సందర్భాల్లో మీడియా స్వేచ్ఛ, పరిధి వంటి అంశాలపై కోర్టులు తెరిచాక విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది. సచివాలయం నుంచి మూడు ప్రాంతాలకు సొరంగాలు ఉన్నాయని ఎక్కడో విన్నామని.. అది నిజమే అయితే.. వాటిని పర్యాటక కేంద్రాలుగా చేయవచ్చునని వ్యాఖ్యానించింది.