తెలంగాణలో కరోనా పడగ బుసలు కొడుతోంది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో డీఎంఈ పరిధి వైద్యులు కొవిడ్ విధులు చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. వైరస్ వ్యాప్తి దృష్ట్యా డీఎంఈ స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు కొవిడ్ విధులు చేయాలని సూచించింది.
డీఎంఈ పరిధి వైద్యులకు కరోనా విధులు
కరోనా ఉద్ధృతి దృష్ట్యా డీఎంఈ పరిధి వైద్యులకు, వైద్య కళాశాలల్లోని బోధన సిబ్బందికి, నాన్ క్లినికల్ విభాగాల్లోని బోధన సిబ్బంది కరోనా విధులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గైనకాలజీ, పీడియాట్రిక్ విభాగాలకు మినహాయింపు ఇచ్చింది.
డీఎంఈ పరిధి వైద్యులకు కరోనా విధులు
గైనకాలజీ, పీడియాట్రిక్ విభాగాలకు మినహాయింపు ఇచ్చింది. వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, సీనియర్ రెసిడెంట్, పీజీలు, ఇంటర్న్లు సైతం విధుల్లో పాల్గొనాలని స్పష్టం చేసింది. నాన్ క్లినికల్ విభాగాల్లోని బోధన సిబ్బందికి, సీనియర్ రెసిడెంట్లు, పీజీలకు కొవిడ్ విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.