తెలంగాణ

telangana

ETV Bharat / state

నేడు పేదల బ్యాంకు ఖాతాల్లో జమకానున్న రూ.1500 - పేదల బ్యాంకు ఖాతాల్లో జమ

సీఎం కేసీఆర్​ వాగ్దానం చేసినట్లు... తెల్ల రేషన్ కార్డుదారుల ఖాతాల్లో నేడు 1500 రూపాయలు జమవుతాయని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

telangana-government-money-credited-today-to-74-lakh-bank-accounts
నేడు పేదల బ్యాంకు ఖాతాల్లో జమకానున్న 1500

By

Published : Apr 14, 2020, 5:40 AM IST

నేడు పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.1500 చొప్పున జమవుతాయని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కరోనా లాక్​డౌన్ నేపథ్యంలో పేద ప్రజలకు అండగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తెల్లరేషన్ కార్డుదారుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయని ట్వీట్ చేశారు.

''కరోనా సమయంలో పేద ప్రజలకు మద్దతుగా సీఎం కేసీఆర్ వాగ్దానం చేసినట్లు... తెలంగాణలో సుమారు 74 లక్షల మంది బ్యాంకు ఖాతాల్లో నేడు రూ.1500 జమకానున్నాయి. ఇందుకోసం రూ. 1,112 కోట్లు ప్రభుత్వం బ్యాంకులకు బదిలీ చేసింది.''

ABOUT THE AUTHOR

...view details