TS Govt letter to KRMB: అత్యున్నత మండలి, బోర్డు అనుమతుల్లేకుండా ఎలాంటి ప్రాజెక్టులు, కాల్వలు, విస్తరణ పనులు చేపట్టకుండా ఆంధ్రప్రదేశ్‌ను నిలువరించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేఆర్‌ఎంబీ ఛైర్మన్ ఎంపీ సింగ్‌కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖలు రాశారు.
ఏపీ చేపట్టిన పంప్‌డ్ హైడ్రో స్టోరేజ్ పథకాలపై ఫిర్యాదు చేసిన తెలంగాణ.. ఎలాంటి అనుమతుల్లేకుండా కృష్ణాపై చేపట్టిందని అభ్యంతరం తెలిపింది. అనుమతుల్లేని ప్రాజెక్టులను నిలువరించాలని బోర్డును కోరింది. ఏపీ చేపట్టిన అన్ని పంప్‌డ్ స్టోరేజ్ పథకాల వివరాలు తెప్పించి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. అటు కర్నూలు జిల్లా పిన్నాపురం వద్ద చేపట్టిన గ్రీన్‌కో విద్యుత్ ప్రాజెక్టుపైనా ఫిర్యాదు చేస్తూ మరో లేఖ రాశారు.