DA sanctioned by Telangana Govt: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సర్కారు శుభవార్త చెప్పింది. వారికి 2.73% ఒక డీఏ మంజూరు చేసింది. 2021, జులై 1వ తేదీ నుంచి పెంపు ప్రయోజనం వర్తించనుంది. జనవరి వేతనం, పెన్షన్‌తో పాటు పెంచిన డీఏతో కూడిన వేతనాన్ని ప్రభుత్వం ఫిబ్రవరిలో అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021, జులై నుంచి 2022, డిసెంబరు వరకు పెంచిన డీఏ బకాయిలను ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాలో జమ చేయనుంది. పెన్షనర్ల బకాయిలను మార్చి నెల పింఛనుతో ప్రారంభించి ఎనిమిది విడతల్లో చెల్లించనుంది. అదే విధంగా సీపీఎస్ ఉద్యోగులకు 90 శాతం బకాయిలను మార్చి నుంచి ఎనిమిది సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏ మంజూరు చేసిన ప్రభుత్వం - DA sanctioned by Telangana Govt
18:38 January 23
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ మంజూరు
17.29 నుంచి 20.02 శాతానికి పెరుగుదల: హరీశ్‌రావు
డీఏ పెంపు ఉద్యోగులు, పెన్షనర్లకు శుభవార్త అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు ట్విటర్ వేదికగా పేర్కొన్నారు. తాజా ఉత్తర్వు ప్రకారం డీఏ 17.29 శాతం నుంచి 20.02 శాతానికి పెరిగిందన్నారు. డీఏ పెంపుతో రాష్ట్రంలోని 4.40 లక్షల మంది ఉద్యోగులు, 2.88 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలుగనుందని తెలిపారు.
డీఏ పెంపు ఉత్తర్వులు జారీ చేయడం పట్ల తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, పింఛనర్ల సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. టీజీవో, టీఎన్జీవో, పీఆర్‌టీయూ టీఎస్‌ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మమత, రాజేందర్, శ్రీపాల్‌రెడ్డి, సత్యనారాయణ, ప్రతాప్, కమలాకర్‌రావులు, సీపీఎస్ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం అధ్యక్షుడు దాముక కమలాకర్, తెలంగాణ ప్రభుత్వ పింఛనర్ల ఐకాస ఛైర్మన్ కె.లక్ష్మయ్య, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, విశ్రాంత టీజీవోల సంఘం అధ్యక్షుడు మోహన్‌నారాయణ, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల సమాఖ్య ప్రధాన కార్యదర్శి జీటీ జీవన్, తెలంగాణ ఉద్యోగుల సంఘం ఛైర్మన్ పద్మాచారి, నేత మార్త రమేశ్ తదితరులు సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
ఇవీ చదవండి: