రాష్ట్ర ప్రభుత్వం మరో వెయ్యి కోట్ల రూపాయలు రుణంగా తీసుకోనుంది. రిజర్వ్ బ్యాంకు ద్వారా రాష్ట్ర బాండ్లను విక్రయించనుంది. 20 ఏళ్ల కాలానికి బాండ్లను జారీ చేసింది. ఇందుకు సంబంధించి జూన్ ఒకటో తేదీన వేలం నిర్వహించనున్నారు.
State Debt: మరో వెయ్యి కోట్ల అప్పు తీసుకోనున్న ప్రభుత్వం - telangana state debt latest news
రాష్ట్ర ప్రభుత్వం మరో వెయ్యి కోట్ల రూపాయలు అప్పు తీసుకోనుంది. రిజర్వు బ్యాంకు ద్వారా బాండ్ల విక్రయంతో బహిరంగ మార్కెట్లో రుణం పొందనుంది. ఈ రూ.1000 కోట్లతో ఈ ఏడాదిలో మొత్తం చేసిన అప్పు రూ.6వేల కోట్లకు చేరింది.
మరో వెయ్యి కోట్ల అప్పు తీసుకోనున్న ప్రభుత్వం
ఏప్రిల్ నెలలో రూ.3000 కోట్ల రూపాయలను ప్రభుత్వం రుణాల ద్వారా సమకూర్చుకొంది. మే నెలలో ఇప్పటికే రూ.2000 కోట్లను అప్పుగా తీసుకుంది. తాజా రుణంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అప్పు మొత్తం రూ.6000 కోట్లకు చేరనుంది.
ఇదీ చూడండి:lockdown: మరో వారం నుంచి 10 రోజులపాటు లాక్‌డౌన్ పొడిగించే అవకాశం