Government Serious on JPS Strike : రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై ఉత్కంఠ నెలకొంది. విధుల్లో చేరేందుకు జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు... రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు ఈ సాయంత్రంతో ముగియనుంది. సర్వీసును క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ... గత 12 రోజులుగా జేపీఎస్‌లు సమ్మె చేస్తున్నారు. సమ్మెను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం... జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు నోటీసు జారీ చేసింది.
Govt on JPS Strike : 'ఇవాళ సాయంత్రం కల్లా విధుల్లో చేరకపోతే ఉద్యోగాల నుంచి తొలగిస్తాం' - notices to JPS in telangana
15:12 May 08
రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సమ్మెపై నెలకొన్న ఉత్కంఠ
విధులకు హాజరుకాని పక్షంలో ఉద్యోగాల తొలగింపు: ఒప్పందం, బాండ్‌కు విరుద్దంగా జేపీఎస్‌లు యూనియన్ ఏర్పాటు, సమ్మె చేయడం చట్టవిరుద్ధమని... సమ్మె ద్వారా ఉద్యోగాన్ని కోల్పోయినట్లైందని పేర్కొంది. మానవతా దృక్పథంతో మరో అవకాశం ఇస్తున్నట్లు తెలిపిన ప్రభుత్వం... ఇవాళ సాయంత్రం ఐదు గంటల్లోపు విధులకు హాజరు కావాలని అల్టిమేటం జారీ చేసింది. లేని పక్షంలో ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు... జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
సమ్మెపై వెనకడుగులేదు:మూడేళ్ల ప్రొహిబిషన్ పీరియడ్ ఉంటుందని చెప్పి... టీఎస్పీఎస్సీ ద్వారా జూనియర్ పంచాయతీ కార్యదర్శులను విధుల్లోకి తీసుకుంది. మూడేళ్లు పూర్తయ్యాక సంవత్సర కాలం పాటు... ప్రొహిబిషన్ పిరియడును పొడిగించింది. అయితే అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్... జేపీఎస్‌లను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి... ఇప్పటివరకు ఇస్తామన్న హామీ ఇవ్వకపోవడంతో వారు సమ్మె బాట పట్టారు. ఇప్పటికే 12 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యదర్శులు ఆందోళనలు చేస్తున్నారు. జిల్లాల్లో యథావిధిగా కార్యదర్శులు సమ్మె కొనసాగింపునకే నిర్ణయించుకున్నారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కార్యదర్శులు కోరుతున్నారు.
న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని వేడుకుంటున్న కార్యదర్శులు : ప్రభుత్వానికి తాము వ్యతిరేకం కాదని.. న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసమే... గత్యంతరం లేని పరిస్ధితుల్లో సమ్మెకు దిగాల్సి వస్తోందని చెబుతున్నారు. జూనియర్ పంచాయితీ కార్యదర్శుల సమ్మె.. నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వం చెపుతుంటే.. తమ సమ్మె న్యాయమైనదేనని కార్యదర్శులు సమర్ధించుకుంటున్నారు. ఇరు పక్షాలు పట్టువీడకపోవడంతో పల్లెల్లో పాలనపై తీవ్ర ప్రభావం చూపెడుతోంది.
ఇవీ చూడండి..